ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in Telangana
టాప్ న్యూస్ @ 9PM
author img

By

Published : Jan 16, 2022, 9:00 PM IST

Fire Accident in Secunderabad Club: అతిపురాతనమైన సికింద్రాబాద్ క్లబ్​లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడిన మంటలను నాలుగు గంటలపాటు శ్రమించి.. ఏడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు.

  • కొత్తగా 2,043 కేసులు.. పోలీస్​శాఖలో భారీగా..!

Telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,043 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

  • డీఎస్​ సొంతగూటికి.. ముహూర్తం ఖరారు..!

DS Joining in Congress: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్.. మళ్లీ తన సొంతగూటికి చేరుతున్నారు. ఈ నెల 24న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారని సమాచారం.

  • టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..

India vaccination drive: భారత్​లో కరోనా టీకా పంపిణీ.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా. వ్యాక్సినేషన్​ ప్రారంభించి ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా.. టీకా పంపిణీలో భారత్​ సాధించిన కీలక మైలురాళ్లపై ఓ సారి లుక్కేద్దాం.

  • దేశంలో కరోనా ఉద్ధృతి​

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్​ సోకింది. వైరస్​తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్​ను జయించారు.

  • ' వ్యాక్సిన్లు శక్తిని అందించాయి'

Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్​ ప్రారంభమై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. కొవిడ్​పై పోరులో టీకాలు శక్తిని అందించాయని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురింపించారు.

  • 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్

Acharya new release date: చిరు 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు.

  • ఇండియా ఓపెన్ నెగ్గిన లక్ష్యసేన్

India Open 2022 Badminton: ఇండియా ఓపెన్​ ఫైనల్స్​లో భారత్​ స్టార్​ షటర్లు లక్ష్యసేన్​, సాత్విక్​ సాయిరాజ్-చిరాగ్​ శెట్టి జోడి అదరగొట్టారు. సింగిల్స్​లో ​సింగపూర్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్​ లోహ్​ కీయన్​ యూపై లక్ష్యసేన్​ విజయం సాధించగా.. డబుల్స్​లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​ అయిన ఇండోనేసియా మోహమ్మద్​ అహసన్​-హెంద్రా సెతియావాన్లపై​ సాత్విక్​-చిరాగ్​ జోడి నెగ్గి టైటిల్​ సొంతం చేసుకుంది.

  • విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు

Govt Decision on Holidays: విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఈనెల 30వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించింది.

  • రేపు కేబినెట్‌ భేటీ

CM KCR Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై రేపు మంత్రి వర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

  • సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం..!

Fire Accident in Secunderabad Club: అతిపురాతనమైన సికింద్రాబాద్ క్లబ్​లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడిన మంటలను నాలుగు గంటలపాటు శ్రమించి.. ఏడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు.

  • కొత్తగా 2,043 కేసులు.. పోలీస్​శాఖలో భారీగా..!

Telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,043 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

  • డీఎస్​ సొంతగూటికి.. ముహూర్తం ఖరారు..!

DS Joining in Congress: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్.. మళ్లీ తన సొంతగూటికి చేరుతున్నారు. ఈ నెల 24న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారని సమాచారం.

  • టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..

India vaccination drive: భారత్​లో కరోనా టీకా పంపిణీ.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా. వ్యాక్సినేషన్​ ప్రారంభించి ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా.. టీకా పంపిణీలో భారత్​ సాధించిన కీలక మైలురాళ్లపై ఓ సారి లుక్కేద్దాం.

  • దేశంలో కరోనా ఉద్ధృతి​

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్​ సోకింది. వైరస్​తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్​ను జయించారు.

  • ' వ్యాక్సిన్లు శక్తిని అందించాయి'

Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్​ ప్రారంభమై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. కొవిడ్​పై పోరులో టీకాలు శక్తిని అందించాయని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురింపించారు.

  • 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్

Acharya new release date: చిరు 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు.

  • ఇండియా ఓపెన్ నెగ్గిన లక్ష్యసేన్

India Open 2022 Badminton: ఇండియా ఓపెన్​ ఫైనల్స్​లో భారత్​ స్టార్​ షటర్లు లక్ష్యసేన్​, సాత్విక్​ సాయిరాజ్-చిరాగ్​ శెట్టి జోడి అదరగొట్టారు. సింగిల్స్​లో ​సింగపూర్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్​ లోహ్​ కీయన్​ యూపై లక్ష్యసేన్​ విజయం సాధించగా.. డబుల్స్​లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​ అయిన ఇండోనేసియా మోహమ్మద్​ అహసన్​-హెంద్రా సెతియావాన్లపై​ సాత్విక్​-చిరాగ్​ జోడి నెగ్గి టైటిల్​ సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.