ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్​ @ 7PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jan 8, 2022, 6:58 PM IST

హైదరాబాద్​లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది.

  • సీబీఐ సిబ్బందికి కరోనా

CBI Corona News: ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్​ అని తేలింది.

  • బాలికపై పూజారి అఘాయిత్యం..!

జాతకం చూపించుకునేందుకు వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆలయ పూజారి. ఈ ఘటన కేరళలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

  • కొవిడ్​ సోకిందని.. కారు డిక్కీలో బంధించి..

Covid in Texas: ఓ మహిళ తన కుమారుడిని కారు డిక్కీలో బంధించి కొవిడ్​ టెస్టుకు తీసుకెళ్లింది. తనకు వైరస్​ సోకకుండా ఈవిధంగా చేసినట్లు ఆమె తెలిపింది. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేశారు అధికారులు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

  • అర్ధరాత్రి భూకంపం- ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..

Earthquake In Western China: శనివారం అర్ధరాత్రి దక్షిణ చైనాను భారీ భూకంపం వణికించింది. భూకంపం కారణంగా ఇళ్లు, భవనాలు ఊగిపోవడం సీసీటీవీల్లో రికార్డయింది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.9 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • డీమార్ట్​కు లాభాల పంట

DMART RESULTS: మూడో త్రైమాసికంలో డీమార్ట్ లాభాల బాట పట్టింది. డిసెంబర్​తో ముగిసిన క్యూ3లో నికరలాభం 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.9,217.76 కోట్లకు పెరిగింది. ఈ మేరకు వివరాలను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్​మార్ట్స్​ లిమిటెడ్ వెల్లడించింది.

  • ఓటీటీలో 'శ్యామ్‌ సింగరాయ్‌' అప్పుడే..!

Shyam Singha Roy OTT: అద్భుతమైన కథ, ఆసక్తికర కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్'. నాని, సాయి పల్లవి నటనకు అనేక ప్రశంసలు లభించాయి. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు శుభవార్త తెలిపింది ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​. ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది.

  • ఒక్కో పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?

Kohli Instagram Income: గతేడాది సోషల్​ మీడియా పోస్టులతో అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో టాప్​-20లో నిలిచాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఒక్కో పోస్టుకు కోహ్లీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

  • అందువల్లే మూడో వేవ్!

Omicron variant in India: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణమని నిపుణులు తేల్చారు. మరోవైపు, ఫిబ్రవరిలో కరోనా ప్రస్తుత వేవ్ తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, రోజుకు ఐదు లక్షల కేసులు బయటపడే అవకాశం ఉందని అమెరికా వైద్య నిపుణుడు అంచనా వేశారు.

  • బండికి ప్రధాని ఫోన్​... ఎందుకంటే..?

Pm Modi call to Bandi Sanjay : బండి సంజయ్​కు ప్రధాని మోదీ ఫోన్​ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జాగరణ దీక్ష, అరెస్టు తదితర పరిణామాలపై ఆరా తీశారు.

  • 'సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇవీ తప్పనిసరి'

హైదరాబాద్​లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది.

  • సీబీఐ సిబ్బందికి కరోనా

CBI Corona News: ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్​ అని తేలింది.

  • బాలికపై పూజారి అఘాయిత్యం..!

జాతకం చూపించుకునేందుకు వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆలయ పూజారి. ఈ ఘటన కేరళలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

  • కొవిడ్​ సోకిందని.. కారు డిక్కీలో బంధించి..

Covid in Texas: ఓ మహిళ తన కుమారుడిని కారు డిక్కీలో బంధించి కొవిడ్​ టెస్టుకు తీసుకెళ్లింది. తనకు వైరస్​ సోకకుండా ఈవిధంగా చేసినట్లు ఆమె తెలిపింది. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేశారు అధికారులు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

  • అర్ధరాత్రి భూకంపం- ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..

Earthquake In Western China: శనివారం అర్ధరాత్రి దక్షిణ చైనాను భారీ భూకంపం వణికించింది. భూకంపం కారణంగా ఇళ్లు, భవనాలు ఊగిపోవడం సీసీటీవీల్లో రికార్డయింది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.9 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • డీమార్ట్​కు లాభాల పంట

DMART RESULTS: మూడో త్రైమాసికంలో డీమార్ట్ లాభాల బాట పట్టింది. డిసెంబర్​తో ముగిసిన క్యూ3లో నికరలాభం 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.9,217.76 కోట్లకు పెరిగింది. ఈ మేరకు వివరాలను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్​మార్ట్స్​ లిమిటెడ్ వెల్లడించింది.

  • ఓటీటీలో 'శ్యామ్‌ సింగరాయ్‌' అప్పుడే..!

Shyam Singha Roy OTT: అద్భుతమైన కథ, ఆసక్తికర కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్'. నాని, సాయి పల్లవి నటనకు అనేక ప్రశంసలు లభించాయి. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు శుభవార్త తెలిపింది ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​. ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది.

  • ఒక్కో పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?

Kohli Instagram Income: గతేడాది సోషల్​ మీడియా పోస్టులతో అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో టాప్​-20లో నిలిచాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఒక్కో పోస్టుకు కోహ్లీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.