ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్​ @ 5PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Oct 4, 2022, 4:58 PM IST

ఉచితాలపై కేంద్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.

  • ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్​న్యూస్

జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించి త్వరలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • కేంద్రం అవార్డులు ఇస్తోంది.. భాజపా నేతలు విమర్శిస్తున్నారు: కేటీఆర్‌

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డులు గెలిచిన 19 పట్టణాలకు 2 కోట్ల చొప్పున నిధులిస్తామని... పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ కార్యక్రమాలపై అధ్యయనం కోసం... 10 మంది బృందాన్ని జపాన్‌, సింగపూర్‌కు పంపుతామని వెల్లడించారు.

  • దసరా కానుకగా మందు, కోళ్లు పంపిణీ.. ఎక్కడో తెలుసా?

కేసీఆర్​ ప్రధాని కావాలని.. దసరా కానుకగా హమాలీలకు అధికార పార్టీకి చెందిన నేత మందు, కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మందికి ఇవి పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం ఏంటని అనేక విమర్శలు వస్తున్నాయి.

  • భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి

గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్‌ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు.

  • బన్నీ ఉత్సవాలకు సిద్ధమైన దేవరగట్టు..

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవరగట్టు.. మరోసారి కర్రల సమరం బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకు.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1276 ప్లస్

అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1276 పాయింట్లు పెరిగింది.

  • పంత్​కు ఊర్వశి 'స్పెషల్' బర్త్​డే విషెస్..

ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా ఉంటారు. వాళ్ల పర్సనల్​, ప్రోఫెషనల్​ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు.

  • ముగ్గురు శాస్త్రవేత్తలకు 'భౌతిక' నోబెల్..

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

  • పర్వాతారోహకులపై హిమపంజా.. 10 మంది మృతి..

ఉత్తరాఖండ్ దెహ్రాదూన్​లో ఘోర దుర్ఘటన జరిగింది. హిమపాతంలో చిక్కుకొని 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందిని సహాయ సిబ్బంది కాపాడారు. హిమపాతంలో చిక్కుకున్న మరో 10 మంది కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

  • ఉచిత హామీలపై ఈసీ ఆందోళన.. రాజకీయ పార్టీలకు లేఖ..

ఉచితాలపై కేంద్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.

  • ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్​న్యూస్

జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించి త్వరలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • కేంద్రం అవార్డులు ఇస్తోంది.. భాజపా నేతలు విమర్శిస్తున్నారు: కేటీఆర్‌

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డులు గెలిచిన 19 పట్టణాలకు 2 కోట్ల చొప్పున నిధులిస్తామని... పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ కార్యక్రమాలపై అధ్యయనం కోసం... 10 మంది బృందాన్ని జపాన్‌, సింగపూర్‌కు పంపుతామని వెల్లడించారు.

  • దసరా కానుకగా మందు, కోళ్లు పంపిణీ.. ఎక్కడో తెలుసా?

కేసీఆర్​ ప్రధాని కావాలని.. దసరా కానుకగా హమాలీలకు అధికార పార్టీకి చెందిన నేత మందు, కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మందికి ఇవి పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం ఏంటని అనేక విమర్శలు వస్తున్నాయి.

  • భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి

గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్‌ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు.

  • బన్నీ ఉత్సవాలకు సిద్ధమైన దేవరగట్టు..

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవరగట్టు.. మరోసారి కర్రల సమరం బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకు.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1276 ప్లస్

అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1276 పాయింట్లు పెరిగింది.

  • పంత్​కు ఊర్వశి 'స్పెషల్' బర్త్​డే విషెస్..

ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా ఉంటారు. వాళ్ల పర్సనల్​, ప్రోఫెషనల్​ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.