ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY
author img

By

Published : Sep 14, 2022, 4:57 PM IST

  • ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో మంటలు.. రన్​వేపై ఉండగా...

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కొచిన్​కు వస్తున్న విమానం మస్కట్​ విమానాశ్రయం రన్​వే పై ఉండగా ఒక్కసారిగా రెండో ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ.. విమానాన్ని కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని నిలిపేశారు.

  • వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలి: గవర్నర్‌ తమిళిసై

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అంతా గుర్తుపెట్టుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన అమృత్ మహోత్సవాలకు గవర్నర్‌ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గవర్నర్ సత్కరించారు.

  • అగ్నిప్రమాద ఘటనలో మృతులు, క్షతగాత్రుల వస్తువులు సీజ్ చేసిన పోలీసులు

సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన, క్షతగాత్రులకు సంబంధించిన వస్తువులను సీజ్ చేసి మొండా మార్కెట్ పీఎస్​కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

  • 'కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేది లేదు'

తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బెదిరింపులు వచ్చినా భయపడలేదని గుర్తు చేశారు. సభలో ఎవరిది తప్పో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేదిలేదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

  • అంజన్న ఆలయంలో అభివృద్ధి ఏదీ.. ?

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయి. సరైన గదులు లేకపోవడం, తాగునీరు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయలు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

  • అల సింహాచల కొండల్లో... మాధవ 'ధార'

ఏపీలోని విశాఖలో గత మూడు రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు మాధవ ధార వద్ద నీరు ప్రవహిస్తోంది. సాధారణ సమయంలో సింహాచల కొండల నుంచి చిన్నపాటి ధార ప్రవహిస్తుండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సింహాచల కొండల నుంచి నీరు అధికంగా వస్తోంది. మాధవ ధార.. మాధవ స్వామి మెట్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం భక్తులను ఆకట్టుకుంటోంది.

  • యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. యడ్డీ ముఖ్యమంత్రిగా ఉండగా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. నివేదిక సమర్పణకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది.

  • పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు

ఇంటి బయట పార్క్ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తనతో టైల్స్ పని చేయించుకుని, డబ్బులు ఇవ్వనందునే ఇలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.

  • మళ్లీ అదరగొట్టేసిన కోహ్లీ.. ఈ సారి ఎందులో అంటే..

సెంచరీ బాది జోష్​లో ఉన్న టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ.. మళ్లీ ఆ విషయంలో తన సత్తా చాటాడు. ఎందులో అంటే?

  • అలా చేసినందుకు ఆ ఇద్దరు స్టార్​ హీరోలపై కేసు నమోదు.. ఏం చేశారంటే?

Thank God Movie : ఓ సినిమా విషయంలో ఇద్దరు స్టార్ హీరోలు వివాదంలో చిక్కుకున్నారు. వారిపై కేసు నమోదైంది. వారిద్దరు ఏం చేశారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.