ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్​ 11AM - today news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 23, 2022, 10:59 AM IST

  • జనగామలో బండి సంజయ్‌ అరెస్టు

జనగామలో బండి సంజయ్‌ అరెస్టు అయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పాములూరులో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్ష చేపట్టిన నేపథ్యంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. బండి అరెస్టుతో పాములూరులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

  • భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

హైదరాబాద్​లో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్​ను అదుపులోకి తీసుకున్న షాహినాయత్ గంజ్ పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేపా పీఎస్​లలో వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

  • అమిత్ షా నా గురువు, ఆయనకు చెప్పులు తీసిస్తే తప్పేంటి

bandi sanjay reacts to amit shah chappal controversy తనపై వస్తున్న ట్రోల్స్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. పాదయాత్రలో కార్యకర్తలకు కూడా తన చేత్తో చెప్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. తమకు గురువులాంటి అమిత్ షాను టచ్ చేస్తేనే భాజపా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారని వెల్లడించారు. అమిత్‌ షా తనకు గురువు, తండ్రి లాంటి వారని అలాంటి వ్యక్తికి చెప్పులు తీసి ఇస్తే తప్పేంటని అన్నారు.

  • మునుగోడు ప్రచారానికి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi on Munugode By Poll సమన్వయంతో పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలకు ప్రియాంకాగాంధీ దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించారు. అందరికంటే ముందుగా ప్రచార బరిలో నిలవాలని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డ ఆమె, ఎలాంటి సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

  • కాసేపట్లో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

Chandrayangutta Flyover Inauguration హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్​ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. రూ.45.79 కోట్లతో 674 మీటర్ల పొడవుతో ఈ పైవంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విమానాశ్రయం, వరంగల్‌, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు 10 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

  • భారత్​లో తగ్గిన కరోనా కేసులు

India Coronavirus Cases భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 8,586 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 48 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.59 శాతానికి చేరుకుంది.

  • ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్​ షాక్​, ఒక్కసారిగా

ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​లో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు విద్యార్థులు. నగరంలోని సెయింట్​ థామస్​ స్కూల్​లో చదువుతున్న స్టూడెంట్స్​.. ఆటో కోసం సమీపంలో ఉన్న బస్​స్టాప్​లో వేచిచూస్తున్నారు. అదే సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. ఆటో వచ్చిందనే హడావుడిలో ఎక్కేందుకు ఓ విద్యార్థి వర్షపు నీటిలో దిగాడు. ఆటోను టచ్​ చేసిన వెంటనే కరెంట్​ షాక్​కు గురయ్యాడు. ఆ తర్వాత మరో విద్యార్థిని కూడా ఆటో ఎక్కేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. ఇద్దరు చిన్నారులను కాపాడారు.

  • డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడం వల్ల వ్యవసాయ, కార్పొరేట్‌ వర్గాల నుంచి రుణాలకు గిరాకీ పెరుగుతోంది. కానీ బ్యాంకుల నిధి సమీకరణకు ప్రధాన వనరైన డిపాజిట్లలోకి డబ్బు ఆ స్థాయిలో రావడం లేదు. దీంతో రుణ గిరాకీని తట్టుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక పథకాలతో డిపాజిట్ దార్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.

  • టీమ్ఇండియా డ్రెస్సింగ్​ రూమ్​ సెలబ్రేషన్స్​

Teamindia celebrations జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్​ఇండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్​ రూమ్​లో ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ చూసేయండి.

  • అల్లు అర్జున్​తో కలిసి నటించిన ఈ హీరోయిన్​ను గుర్తుపట్టారా

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్​గా తనకంటూ ఓ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకున్న హీరో అల్లుఅర్జున్​. ప్రస్తుతం ఆయన తన అర్థాంగి స్నేహారెడ్డితో కలిసి ప్రస్తుతం న్యూయార్క్‌లో సరదాగా గడుపుతున్నారు. అలానే అక్కడ 'ఇండియా డే పరేడ్‌ న్యూయార్క్‌ - 2022' కార్యక్రమానికి ఈ యేడాది గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో భారతదేశం నుంచి అల్లు అర్జున్‌ ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే అక్కడ తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్​ను కలిశారు. ఆమెతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. వాటిని చూసేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.