ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 22, 2022, 1:00 PM IST

  • కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్ధపు జోక్

KTR tweet on Amit shah కేంద్ర హోం శాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్​షాను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అన్న షాపై తీవ్రంగా మండిపడ్డారు. అమిత్​షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్ధపు జోక్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధును కాఫీకొట్టి ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పేరిట ప్రవేశపెట్టారని ట్వీట్ చేశారు.

  • జీడిమెట్లలో రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీధర్ బయోటెక్ అనే రసాయన పరిశ్రమలో 5 రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా 5 రియాక్టర్లు పేరి భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు.

  • హైదరాబాద్​లో ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. దీంతో ఆ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్దా - ఉన్హేల్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వన్తున్న ఒక లారీ,​ స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టగా అందులో ఉన్న విద్యార్థుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో 11 మందిని చికిత్స కోసం ఉజ్జయినికి తరలించారు.

  • దిల్లీలో మళ్లీ రైతుల నిరసన, భారీగా ట్రాఫిక్​ జాం

Farmers protest in Delhi దేశ రాజధానిలో మరోసారి రైతుల ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగం సహా పలు సమస్యలపై దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా మహాపంచాయత్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అన్నదాతలు దిల్లీకి చేరుకున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ సహా సరిహద్దుల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ ఆఫర్​

భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారన్నారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా. తనపై పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి ఆయన చెప్పారు.

  • వారిని టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు.

  • సెక్స్​ టాయ్స్​తో షూ తయారీ

సెక్స్​ టాయ్స్​తో పాదరక్షల తయారీ! వినడానికి వింతగా ఉందా? కానీ అమెరికాకు చెందిన రెండు సంస్థలు కలిసి ఇవే పనిచేస్తున్నాయి. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉందని చెబుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

  • కోహ్లీఫామ్​పై పాక్​ మాజీ కెప్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ​పై పాక్​ మాజీ సారథి​ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..

  • మెగాస్టార్​ కాకుండా చిరంజీవిని ఇంకేమని పిలుస్తారో తెలుసా

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. ఆ అరుదైన గౌరవం చిరంజీవికే దక్కింది. ఆయన్ను మెగాస్టార్​ కన్నా ముందు ఏమని పిలిచేవారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.