ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్​ 9AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 19, 2022, 9:00 AM IST

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా పండ్లు, మిఠాయిల పంపిణీ

Independence Diamond celebrations స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పండ్లు, మిఠాయిల పంపిణీ జరగనుంది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా 20లక్షలకుపైగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

  • ఆ 42 యూజర్‌ ఐడీలతో బోధన్‌ స్కామ్

Bodhan Commercial Taxes Scam బోధన్ కేంద్రంగా జరిగిన వాణిజ్య పన్నులశాఖ నకిలీ చలానాల కుంభకోణం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం 42 యూజర్‌ ఐడీల ద్వారా ఈ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ యూజర్‌ ఐడీలను ఎవరు వాడారన్న విషయం మాత్రం బయటపడటం లేదు. సీఐడీ ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నా శాఖ నుంచి సరైన సమాధానం రావడం లేదు. దాంతో అయిదేళ్ల నుంచి సాగుతున్న దర్యాప్తులో అసలు నిందితులెవరో తేలడం లేదు.

  • ఘీ పెట్టి అడిగినా లేదంటున్నారే

Milk shortage in Telangana రాష్ట్రంలో నెలకొన్న పాలకొరత దాని ఉత్పత్తులపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ డైయిరీ విజయ బ్రాండు నెయ్యికి మార్కెట్​లో ఎంతో డిమాండున్నా సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ముంబయి, దిల్లీ నుంచి ఆర్డర్లు వస్తున్నా పంపలేకపోతున్నారు. గేదెపాలు దొరక్క ఉత్పత్తి లేదంటూ సరఫరా తగ్గించామని వ్యాపారులు చెబుతున్నారు. దాంతో కర్ణాటక నుంచి ఆవుపాల కొనుగోలు తప్పడం లేదు.

  • జైల్లో ఖైదీ హత్య, 15 మందికి ఉరిశిక్ష

Jharkhand Jail Murder ఝార్ఖండ్‌లోని జంశెద్​పుర్​లో ఓ ఖైదీ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 15 మందికి మరణదండన విధించింది.

  • లేనివి ఉన్నట్లు చూపి రూ 150 కోట్ల స్కాం

Punjab Scam పంజాబ్ ప్రభుత్వం పెద్ద కుంభకోణం బయటపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​ సింగ్ హయాంలో రూ 150 కోట్ల కుంభకోణం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కుల్దీప్‌ సింగ్‌ దహిల్వాల్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

  • మీ పిల్లలకు డెంగీ జ్వరమా

Dengue Fever Precautions దోమకాటు ప్రమాదకరంగా మారుతోంది. ఫలితంగా రాష్ట్రంలో డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చినుకుజాడతో దోమల బెడద, దాంతో పాటే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, వైరల్‌ జ్వరాలు ప్రబలుతాయి. ఈ జబ్బులు పిల్లలకు తొందరగా వ్యాపిస్తాయి. పిల్లలకు వచ్చే జ్వరాలతో ఆందోళన చెందకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా డెంగీ రాకుండా అప్రమత్తంగా ఉండండి.

  • మరో వివాదంలో ఆ దేశ ప్రధాని

Sanna Marin Party Video ఫిన్లాండ్​ ప్రధాని సనా మారిన్​ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రెండ్స్​తో కలిసి ఆమె డ్యాన్స్​ చేస్తున్న ఓ వీడియో వైరల్​గా మారింది. అయితే ఆమె డ్రగ్స్​ తీసుకుని ఉండొచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

  • చుట్టూ అంతా ఉన్నా ఒంటరితనం

తాను కెరీర్​ను నిర్మించుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తెలిపాడు. ఎలాంటి సమయంలోనైనా మద్దతుగా నిలుస్తూ, ప్రేమించే సభ్యులు తన చుట్టూ ఉన్నా కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించానంటూ చెప్పుకొచ్చాడు.

  • ఛార్మితో రిలేషన్‌పై పూరీ క్లారిటీ

గత కొద్ది రోజులుగా స్టార్​ దర్శకుడు పూరీ జగన్నాథ్​, ఛార్మిల మధ్య లివింగ్​ రిలేషన్​ షిప్​ ఉన్నట్లు సోషల్​ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా ఛార్మితో రిలేషన్​పై పూరీ క్లారిటీ ఇచ్చారు.

  • మహేష్ త్రివిక్రమ్​ల కొత్త చిత్రం ఎప్పుడంటే

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చే సినిమా అంటే ఫ్యాన్స్​కు పండగే. అతడు, ఖలేజా వంటి బ్లాక్​బస్టర్ సినిమాల తరువాత వారిద్దరి కలియికతో మరో చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.