ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 4, 2022, 1:01 PM IST

  • 'కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్'.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Baba Ramdev news: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్ బూస్టర్ డోసు వేసుకున్నా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కరోనా బారినపడ్డారని అన్నారు. ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు.

  • రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు

Bandi Sanjay on By Elections in Telangana : రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. భువనగిరి పట్టణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బండి సంజయ్​.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. సాదుద్దీన్​కు బెయిల్

Jubilee Hills Gangrape Case updates: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మైనర్లు బెయిల్‌పై విడుదలయ్యారు.

  • జలసౌధలో కేఆర్​ఎంబీ సమావేశం

KRMB Committee Meeting: హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. తెలంగాణ, ఏపీ ఈఎన్​సీలు సమావేశానికి హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

  • రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mla Korukanti Chander News : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే అనుచరులు డబ్బు వసూలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

  • ఆరు రూపాయల టికెట్​తో రూ.కోటి లాటరీ

Punjab constable 1 crore lottery: ఆ కానిస్టేబుల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆరు రూపాయలే.. అయితేనేం.. అదే అతడిని కోటీశ్వరుడిని చేసింది.. పంజాబ్​కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించింది.

  • సమాధి నుంచి శవాన్ని తీసి పూజలు

నాగుపాము కాటుకు గురై చనిపోయిన ఓ బాలుడిని బతికించేందుకు తాంత్రికులు విఫలయత్నం చేశారు. బాలుడి మరణించగానే కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే, పాములు పట్టేవారు బాలుడ్ని బతికిస్తామని చెప్పడం వల్ల పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీశారు కుటుంబ సభ్యులు. చేతిలో వేపకొమ్మలు పట్టుకుని.. మంత్రాలు పఠిస్తూ పాములు పట్టేవారు పూజలు చేశారు. ఎంతకీ బాలుడిలో చలనం లేకపోవడం వల్ల మళ్లీ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని శివాల ఖుర్ద్​లో జరిగింది.

  • తైవాన్​ను చుట్టుముట్టిన చైనా

China drills Taiwan: తైవాన్​ను తనలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా.. తాజాగా ఆ దేశం చుట్టూ భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలు సంయుక్తంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం.

  • 'అతడు కాబోయే వరల్డ్‌ నెం.1 బౌలర్‌

విండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న బౌలర్​ అర్ష్​దీప్​ సింగ్​ ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని టీమ్​ఇండియా మాజీ సెలెక్టర్​ కృష్ణమాచారి శ్రీకాంత్​ తెలిపాడు. ప్రపంచకప్‌ జట్టులో తప్పకుండా అతడికి చోటు కల్పించాలని ప్రస్తుత చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మకు క్రిష్ సూచించాడు.

  • 'స్కామ్ 1992' నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Mithilesh Chaturvedi Died: గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మిథిలేశ్​ చతుర్వేది కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.