ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @7AM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 2, 2022, 6:59 AM IST

  • అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరి హతం..!

అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరి హతమయ్యారు. అమెరికా దాడుల్లో అల్‌ఖైదా నాయకుడు అల్‌జవహరిని చంపేసినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడన్‌ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

  • దేశంలో మరో మంకీపాక్స్ కేసు..

Monkeypox Delhi: దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దిల్లీలో నివసిస్తున్న నైజీరియావాసికి వైరస్ పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశస్థులైన మరో ఇద్దరిని.. అనుమానిత కేసులుగా పరిగణించి ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు, మంకీపాక్స్​పై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది.

  • స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. కార్యాచరణ ఖరారు చేయనున్న సీఎం

CM KCR on independence day: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రూపొందించనున్నారు. కార్యక్రమాలు, విధివిధానాలు, సంబంధిత అంశాలపై కమిటీతో సీఎం సమావేశం కానున్నారు.

  • ముగిసిన వీఆర్వోల శకం.. వివిధ శాఖలకు కేటాయింపు

VROS in TS: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల శకం ముగిసింది. రెండేళ్ల కిందటే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం 5వేల 294 మందిని రెవెన్యూ మినహా ఇతర శాఖలకు లాటరీ ద్వారా పంపింది. సోమవారం రాత్రి వరకు ప్రక్రియ సాగింది. కొందరు నిన్ననే కొత్త ఉద్యోగాల్లో చేరగా మిగతావారు ఇవాళ రిపోర్ట్ చేయనున్నారు.

  • ప్రముఖుల బంధాలు.. హవాలా కోణాలపై ఈడీ ఆరా

ED Inquiry on Casino Case : క్యాసినో దందాలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి, సంపత్‌లపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో ప్రవీణ్‌, మాధవరెడ్డి తడబడినట్టు తెలుస్తోంది. ఈ బృందాన్ని సుమారు పదిన్నర గంటలపాటు వారిని ఈడీ విచారించింది. విదేశీ లావాదేవీలు, హవాలా వ్యాపారాలకు సంబంధించి తమ దర్యాప్తులో వెల్లడయిన అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

  • ఇంటింటా జ్వరాలు.. పొరపాటు జరిగితే అనర్థాలు

Seasonal Fevers in Telangana : జ్వరమొచ్చింది! ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఈ విష జ్వరాలన్నీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగుండటం వల్ల ఏది ఏ జ్వరమో తేల్చుకోలేని గందరగోళం నెలకొంటోంది. అవటానికి జ్వరాలే అయినా చికిత్సలు వేర్వేరు. పొరపాటు జరిగితే తీవ్ర అనర్థానికీ దారితీయొచ్చు. కాబట్టి ఆయా జ్వరాల కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

  • నేడే బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభంకానుంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి వరంగల్‌ భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది. 328 కిలోమీటర్ల మేర సాగే యాత్రను కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, కిషన్‌ రెడ్డిలు ప్రారంభించనున్నారు. ఆగస్టు 26న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది.

  • భారత్​ ఖాతాలో మరో పతకం.. కాంస్యం నెగ్గిన హర్జీందర్​ కౌర్

common wealth bronze: బర్మింగ్ హమ్​ వేదికగా జరుగుతున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాాజాగా మరో వెయిట్​ లిఫ్టర్ కాంస్యం కైవసం చేసుకుంది. 71 కేజీల విభాగంలో పోటీపడిన హర్జీందర్ కౌర్ ఫైనల్లో కాంస్యం గెలిచింది.

  • మెకాయ్‌ మెరుపు బౌలింగ్‌.. రెండో టీ20లో విండీస్​దే విన్

ind vs west indies: సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో విండీస్ అదరగొట్టింది. భారత్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ జట్టు బౌలర్ మెకాయ్ ఆరు వికెట్లతో చేలరేగాడు.

  • బాలయ్య 'ఆదిత్య 369'-కల్యాణ్​రామ్​ 'బింబిసార'కు ఉన్న లింక్ తెలుసా?

KalyanRam Bimbisara: ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టమని, అందుకే తొలి ప్రయత్నంగా 'బింబిసార' లాంటి కథను ఎంచుకున్నట్లు తెలిపారు దర్శకుడు వశిష్ఠ్​. ఈ కథను రూపొందించడానికి బాలయ్య నటించిన 'ఆదిత్య 369' స్ఫూర్తినిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మూవీ చిత్రీకరణను 135 రోజుల్లోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.