ETV Bharat / city

Telangana Latest News : టాప్​న్యూస్ @ 11AM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Latest Newsచాదర్‌ఘాట్‌ను ముంచెత్తిన మూసీ..
Telangana Latest News
author img

By

Published : Jul 27, 2022, 11:00 AM IST

  • చాదర్‌ఘాట్‌ను ముంచెత్తిన మూసీ..

Musi Floods Effect: భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్‌ వంతెన పైనుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. అధికారులు వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు.

  • చాదర్​ఘాట్, మూసారంబాగ్ వంతెనలు మూసివేత

Musi Floods in Hyderabad : హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సోమవారం అర్ధర్రాతి విధ్వంసం సృష్టించిన వరుణుడు మంగళవారమూ విశ్రాంతి తీసుకోలేదు. చాలాచోట్ల.. కుండపోతగా వాన కురిసింది. చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. మూసీ ఉగ్రరూపం దాల్చి మూసారంబాగ్, చాదర్​ఘాట్ వంతెనలపై నుంచి ప్రవహిస్తుండటం వల్ల అధికారులు ఈ రెండు వంతెనలు మూసివేశారు.

  • ఎస్సారెస్పీ 22 గేట్లు ఎత్తిన అధికారులు

SRSP Water Levels: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 22గేట్లు ఎత్తి 99,940 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,10,690 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

  • ఆ ప్రాజెక్టుల గేట్ల మతలబు.. జనరేటర్లకే ఎరుక

No Electricity at komaram bheem project : కుమురం భీం జిల్లాలో అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఆ రెండు ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా ఆ ప్రాజెక్టుల గేట్లను ఎత్తాలంటే జనరేటర్లు దిక్కయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఊహించిన వరద ఉద్ధృతి వచ్చిప్పుడు.. అవి కూడా మోరాయిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో ముగ్గురు బాలురు బెయిల్​పై విడుదల

Jubilee Hills Case updates: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురు బాలురు నిన్న బెయిల్​పై విడుదలయ్యారు. మరో బాలుడు నేడు విడుదల కానున్నాడు.

  • హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification for Jobs in High court: తెలంగాణ హైకోర్టు.. టైపిస్ట్, కాపీరైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 10 నుంచి 25లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చని తెలిపింది. సెప్టెంబరు 5న హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

  • దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 18,313 మంది వైరస్ బారిన పడగా.. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. జపాన్​, జర్మనీల్లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్​లో కొత్తగా 1.54 లక్షల మందికి కరోనా సోకగా.. జర్మనీలో 1.21 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

  • భాజపా యువనేత దారుణ హత్య

BJP Activist Killed: భాజపా కార్యకర్త దారుణ హత్యకు గురైన సంఘటన దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. తమ పార్టీ కార్యకర్త హత్యను ఖండించారు సీఎం బసవరాజ్​ బొమ్మై. నిందితుల్ని పట్టుకొని శిక్షిస్తామని అన్నారు.

  • విదేశీ బట్టలు వద్దన్నందుకు లారీతో తొక్కించి..

అతనో నిరుపేద యువకుడు. బట్టల మిల్లులో కార్మికుడు. ఎప్పుడో కానీ రెండుపూటలా భోజనం చేయలేడు. మూడు జతల దుస్తులు, భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆయన ఆస్తులు. దేశభక్తిలో మాత్రం తనని మించిన ధనికులు లేరు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఒంటిపై ఉన్న విదేశీ దుస్తులను కాల్చేశాడు. తన ప్రాణాలనూ తృణప్రాయంగా బలిచ్చాడు. తప్పుకొనేందుకు అవకాశమున్నా తన పేరు తరతరాలకు గుర్తుండేలా రక్తతర్పణం చేశాడు. అతడే.. భరతమాత ముద్దుబిడ్డ బాబూ గేను సేద్‌.

  • ఉదయమే కారులో సెక్స్​ చేసిన విజయ్​ దేవరకొండ

పొద్దు పొద్దున్నే రౌడీ హీరో విజయ్​ దేవరకొండ కారులోనే సెక్స్​ చేశాడట. ఈ విషయాన్ని ఒక స్టార్​ హీరోయిన్​ చెప్పడం గమనార్హం. అయితే ఆ హీరోయిన్​ మాటలను విజయ్​ దేవరకొండ కన్ఫర్మ్​ చేయడమే ఇందులో ట్విస్ట్​. ఇంతకీ విజయ్​ ఎందుకు అలా చేశాడు? అసలేం జరిగింది.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.