ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @1PM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1pm topnews
1pm topnews
author img

By

Published : Jul 19, 2022, 12:59 PM IST

  • 'పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు'

పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు.

  • రేవంత్​రెడ్డి త్రిముఖ వ్యూహాం...

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌.... త్రిముఖ వ్యూహానికి పదును పెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. తెరాస, భాజపాను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తూ... హల్‌చల్‌ చేస్తున్నారు.

  • కలర్స్​ హెల్త్​కేర్​కు వినియోగదారుల కమిషన్ షాక్..

అధిక బరువుతో బాధపడుతున్నారా...? ఇంటి దగ్గర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? మా వద్దకు రండి.. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోతున్నవారు కోకల్లలు. తాజాగా ఓ వనపర్తికి చెందిన బాలిక... ఓ సంస్థ చేతిలో మోసపోగా... వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించింది. ఆ సంస్థకు వినియోగదారుల కమిషన్​ షాక్​ ఇచ్చేలా తీర్పునిచ్చింది.

  • ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా ఉభయ సభలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

  • గోమూత్రం కొనుగోలుకు ప్రభుత్వ పథకం.. లీటర్​ ఎంతంటే?

లీటర్​ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయన్నట్లు ప్రకటించింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. 'గోధన్​ న్యాయ్​ యోజన' పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది.

  • గన్​తో బెదిరించి చోరీకి యత్నం..

గుజరాత్​ మోడాసా జిల్లా కేంద్రంలోని ఓ ఎలక్ట్రానిక్​ షాపులో దోపిడీకి యత్నించారు ముగ్గురు దుండగులు. మల్పుర్​ రోడ్డులోని షాపులోకి వచ్చిన దుండగులు.. నగదు ఇవ్వాలంటూ యజమానిని తుపాకీతో బెదిరించారు. అతడు నగదు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల అతడిపై దాడి చేశారు. అనంతరం బైక్​పై అక్కడి నుంచి పరారయ్యారు.

  • రికార్డు కనిష్ఠానికి రూపాయి విలువ..

గతకొన్ని రోజులుగా 79.90పైన ట్రేడవుతూ 80తో దోబూచులాడిన రూపాయి ఎట్టకేలకు ఈరోజు విశ్లేషకుల అంచనాలను నిజం చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మంగళవారం రూ.80 మార్క్‌ను తాకింది. ఈ నేపథ్యంలోనే దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • హార్దిక్‌ పాండ్య.. టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా ఆశాకిరణం

2022 ఐపీఎల్‌లో అందరూ ఆశ్చర్యపోయి తనవైపు చూసేలా చేశాడు హార్దిక్‌. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా మెరుపులు మెరిపించడమే కాక.. కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. ఆ మెరుపులు తాత్కాలికం కాదని రుజువు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ ఇండియా జట్టుకు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.

  • పార్వతిగా దీపికా పదుకొణె.. 'బ్రహ్మాస్త్ర-2'లో రణ్​బీర్​ కపూర్ సరసన!

రణ్​బీర్​ కపూర్ ప్రధాన పాత్రలో 'బ్రహ్మాస్త్ర-2' సినిమా సిద్ధం అవుతోంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పార్ట్​-1 పూర్తి కాగా.. ఇందులో రణ్​బీర్​- ఆలియా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే రెండో భాగం కోసం రణ్​బీర్​ కపూర్ సరసన నటించేందుకు దీపికా పదుకొణెను తీసుకోనున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.