ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

TOP NEWS@6AM
టాప్​న్యూస్@6AM
author img

By

Published : Oct 10, 2021, 5:52 AM IST

Updated : Oct 10, 2021, 9:51 PM IST

21:44 October 10

టాప్​ న్యూస్​ @10PM

  • మా ఎన్నికల్లో రఘబాబు, శివ బాలాజీ విజయం

ఎంతో ఆసక్తిగా జరిగిన మా ఎలక్షన్​లో విష్ణు ప్యానల్​కు చెందిన రఘబాబు, శివబాలాజీ విజయం సాధించారు.

  • పాప సేఫ్​..

పుట్టినప్పుడే ఆశలు లేవన్నారు వైద్యులు.. తల్లిదండ్రులు నిరాశలో మునిగిపోయారు.. కానీ బతికింది. మళ్లీ మూడేళ్లకు కిడ్నాప్ రూపంలో ఆపద ఎదురైంది. బతికి ఉందో లేదోనని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కానీ తిరిగి ఇంటికి చేరింది. నిజామాబాద్ నగరంలో ఓ షాపింగ్ మాల్ వద్ద అపహరణకు గురైన ఆష్క్యా హనీ మూడేళ్ల వయసులోనే రెండుసార్లు ఆపద నుంచి బయటపడి పునర్జన్మను పొందింది. 

  • కశ్మీర్​లో 40 మంది టీచర్లకు సమన్లు

మైనారిటీలపై దాడులకు సంబంధించి 40 మంది ఉపాధ్యాయులకు సమన్లు పంపింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)(NIA news india). జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న మైనారిటీల హత్యల కేసును స్థానిక పోలీసుల నుంచి అధికారికంగా బదిలీ చేసుకున్న ఎన్​ఐఏ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టింది. మరో 400 మంది అనుమానితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

  • ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోకుంటే.. వేతనం లేని సెలవులే!

ఉద్యోగులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరైన నేపథ్యంలో.. అమెరికాలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే టెక్​ దిగ్గజం ఐబీఎం అమెరికాలోని తమ ఉద్యోగులంతా డిసెంబర్ 8లోపు వ్యాక్సిన్​ వేసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే వేతనం లేని సెలవులపై పంపాల్సి ఉంటుందని వెల్లడించింది.

  • చెలరేగిన పంత్​- షా

ఐపీఎల్-2021 తొలి క్వాలిఫైయర్స్​లో సీఎస్​కేకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దిల్లీ క్యాపిటల్స్​. నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది దిల్లీ.

20:50 October 10

టాప్​ న్యూస్​ @9PM

  • మంచు విష్ణు ఆధిక్యం

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

  • ఐదుగురిని మింగిన గోడ

రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటిగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదాన్ని నింపింది. ఇంట్లో గదులను వేరు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోడ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్నవారిపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు.. ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు.

  • తగ్గనున్న వంట నూనెల ధరలు!

దేశంలో వంట నూనెల ధరల మంటకు చెక్​ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితిలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనితో త్వరలోనే ధరలు సాధారణ స్థాయికి దిగిరావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం

విమానం కూలిన ఘటనలో 15 మంది మరణించారు. రష్యాలోని మెంజిలిన్స్క్​ ప్రాంతం వద్ద (Russia Plane Crash) ఈ ప్రమాదం జరిగింది.

  • మళ్లీ ఓడిన టీమ్​ఇండియా

ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళా జట్టు ఓటమితో ముగించింది. మూడో టీ20లోనూ ఓడిపోయింది.

19:42 October 10

టాప్​ న్యూస్​ @8PM

  • కొనసాగుతున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు 

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత కార్యవర్గ సభ్యుల ఫలితాలు వెలవడుతున్నాయి. మంచు విష్ణు ప్యానెల్‌లో 8మందికి విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో నలుగురు గెలుపొందారు.

  • 'వారికి కూడా వ్యాక్సిన్​' 

దేశంలో 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా కొవిడ్ టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy Comments) తెలిపారు. వచ్చే దసరా నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 160 దేశాలు కొవిడ్ టీకా కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో టీకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందిన తర్వాతే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. హైదరాబాద్​లో పర్యటించిన ఆయన అంబర్​పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • పాక్​ అణుపితామహుడు కన్నుమూత 

పాకిస్థాన్ అణు పితామహుడిగా పేరొందిన.. అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూశారు. పాక్​ను అణ్వాయుధ దేశంగా మార్చేందుకు 1970ల ప్రారంభంలో తోడ్పాటునందించిన అబ్దుల్.. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 85ఏళ్ల వయసులో రావల్పిండిలో మరణించారు.

  • రిలయన్స్​ చేతికి ఆర్​ఈసీ సోలార్

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్​ లిమిటెడ్​ వ్యాపార కార్యకలాపాలు చరుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే హరిత ఇంధన మార్కెట్​లోకి ప్రవేశించిన ఈ సంస్థ.. తొలిసారి మరో కంపెనీని కొనుగోలు చేసింది. నార్వే, సింగపూర్​ కేంద్రాలుగా పని చేస్తున్న ఆర్​ఈసీ సోలార్ అనే సంస్థను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

  • దిల్లీ బ్యాటింగ్​

దుబాయ్​ వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ 2021 తొలి క్వాలిఫైయర్స్​లో టాస్​ గెలిచింది సీఎస్​కే. దిల్లీ బ్యాటింగ్​కు దిగనుంది. సీఎస్​కే తుది జట్టుకు మార్పులేమీ చేయలేదు. దిల్లీ మాత్రం టామ్​ కరెన్​ను తీసుకుంది.

18:43 October 10

టాప్​ న్యూస్​ @7PM

  • 'ఈటల మోసానికి - గెల్లు విధేయతకు మధ్య పోటీ'

హుజురాబాద్ ఎన్నికలు.. ఈటల మోసానికి, గెల్లు విధేయతకు మధ్య జరుగుతున్న పోటీ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు . బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంతో మాట్లాడి బీసీ జనగణన జరిగేలా చూడాలని ఈటలకు సూచించారు.

  • విద్యుత్‌ సంక్షోభంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

దేశంలో విద్యుత్​ సంక్షోభం(Power crisis in India) ఏర్పడనుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ (RK singh news)​. మరో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు.

  • పెట్రోల్ బంక్​ లైసెన్స్​తోనే ఈవీ ఛార్జింగ్​ స్టేషన్​కూ అనుమతి

2019లో సవరించిన పెట్రోల్ బంక్​ల లైసెన్సింగ్ నిబంధనలపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పెట్రోల్​ బంక్​ల ఏర్పాటుకు లైసెన్స్​ పొందిన సంస్థలు.. పెట్రోల్​, డీజిల్ విక్రయాలకు ముందే.. విద్యుత్​ వాహనాల ఛార్జింగ్ పాయింట్, సీఎన్​జీ వంటి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

  • అఫ్గానిస్థాన్​కు లైన్​ క్లియర్​

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాల్గొనేందుకు అఫ్గానిస్థాన్​ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు ఐసీసీ సీఈఓ(ICC CEO) జియోఫ్​ అలాడైస్​. అయితే తాలిబన్ల జెండాతో ఆ దేశ జట్టు ప్రపంచకప్​లో పాల్గొనాలనుకుంటే టీమ్​పై నిషేధం విధించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

  • శివబాలాజీ చేతిని కొరికిన హేమ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa elections 2021) ఎలక్షన్ సందర్భంగా నటుడు శివబాలాజీ చేతిని హేమ కొరికారు. దీంతో చిన్న గాయమైంది. వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేశారు.

17:49 October 10

టాప్​ న్యూస్​ @6PM

  • కొనసాగుతోన్న లెక్కింపు..

‘మా’ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా ఈసీ మెంబర్స్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక వైపు ప్రకాశ్‌రాజ్‌, మరోవైపు మంచు విష్ణులు స్వయంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

  • చిన్నారి ఆచూకీ లభ్యం

నిజామాబాద్‌లో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి అష్క్యా హనీ ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్ర నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పోలీసులు పాపను నిజామాబాద్ తీసుకుని వస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్‌ను ఛేదించారు. శుక్రవారం నిజామాబాద్​ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద పాపను దుండగులు అపహరించారు. మూడు రోజులకు పాప ఆచూకీ లభ్యం కాగా.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించి విచారణ చేయడంతో ఆచూకీ తెలుసుకోగలిగారు.

  • టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​

దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​ చెప్పింది. పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భధ్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలందిస్తుందని వెల్లడించారు.

  • కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

  • తాలిబన్ల​ 'ట్రీట్​మెంట్​'

అఫ్గానిస్థాన్​ కాబుల్​లో డ్రగ్స్​ బానిసల పరిస్థితి దయనీయంగా ఉంది(taliban news). వీరిపై తాలిబన్లు ప్రత్యేక దృష్టిపెట్టారు. దొరికిన వారిని దొరికినట్టు డ్రగ్స్​ ట్రీట్​మెంట్​ సెంటర్లకు తరలిస్తున్నారు(afghanistan news). వారితో నగ్నంగా స్నానం చేయించి, గుండు కొట్టిస్తున్నారు. భోజనం పెట్టడం లేదు. ఎందుకు? అని అడిగితే.. చికిత్సలో భాగం అని జవాబు చెబుతున్నారు.

16:54 October 10

టాప్​ న్యూస్​ @5PM

  • భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు!

  • 'మా' ఎన్నికల కౌంటింగ్ షురూ

'మా' కొత్త అధ్యక్షుడు ఎవరో మరికొద్ది గంటల్లే తెలిసిపోతుంది. ఉదయం జరిగిన పోలింగ్​ ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు.

  • 'వారు అబద్ధాలకోరులు' 

హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender at Sriramula Pally)​..​ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారాల్లో సీఎం కేసీఆర్​, తెరాస పాలనపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా శ్రీరాములపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్​, హరీశ్​ రావు పచ్చి అబద్ధాల కోరులని ఈటల ఎద్దేవా చేశారు.

  • టీ20 ప్రపంచకప్​ విజేతకు ప్రైజ్​మనీ ఎంతంటే?

ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) విజేత జట్టు అందుకోనున్న ప్రైజ్​మనీపై(T20 World Cup Prize Money) స్పష్టతనిచ్చింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News). విజేతకు రూ.12.02 కోట్లు, రన్నరప్​ టీమ్​కు రూ.6 కోట్లు అందజేయనున్నట్లు తెలిపింది.

  • 'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri News) ఘటన, ఆపై చెలరేగిన రాజకీయ దుమారంపై 'వాస్తవాలను' రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు(Ramnath Kovind) సమర్పించనున్నట్లు కాంగ్రెస్(Congress Party) ప్రకటించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది.

15:44 October 10

టాప్​ న్యూస్​ @4PM

  • 'మా' ఎన్నికలు పూర్తి.. రికార్డు స్థాయిలో ఓటింగ్

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మా ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు 7 గంటలకు పాటు ఓటింగ్ జరగ్గా, 600కి పైగా ఓట్లు పోలయ్యాయి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారో?

  • మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..

"కామా తురాణం.. న భయం.. న లజ్జ.." అనే దగ్గరి నుంచి.. "కామా తురాణం.. న ఆడ.. న మగ.." అనేంత దుస్థితికి చేరుకున్నాం. ఇన్ని రోజులు.. వావివరసలు, వయోభేదం లేకుండా.. రాబంధుల్లా ఎగబడుతున్నారని బాధపడుతుంటే.. ఇప్పుడు లింగభేదం కూడా రెచ్చిపోతున్నారన్న జుగుప్స కలిగించే స్థాయికి దిగజారుతున్నారు. అసలేం జరిగిందంటే..!!

  • చిన్నారి సేఫ్​!

నిజామాబాద్‌లో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి అష్క్యా హనీ ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్ర నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పోలీసులు పాపను నిజామాబాద్ తీసుకుని వస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్‌ను ఛేదించారు. 

  • అసోం సీఎం హత్యకు కుట్ర!

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది(assam cm news). అదే రాష్ట్రానికి చెందిన శరత్​ దాస్​ అనే ఓ వ్యక్తిని.. కొందరు దుండగులు అపహరించి, సీఎంను హత్య చేయాలని చేతికి తుపాకీ ఇచ్చారు(himanta latest news). ఈ విషయాన్ని శరత్​ స్వయంగా వెల్లడించాడు. తనని రక్షించమంటూ ఓ వీడియోలో వేడుకున్నాడు.

  • ఆ నటుడితో రిలేషన్​లో రకుల్​ప్రీత్

'కొండపొలం' సినిమాతో అభిమానుల్ని అలరిస్తున్న రకుల్​ప్రీత్.. గుడ్​న్యూస్ చెప్పేసింది. ప్రముఖ నటుడితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది.

14:39 October 10

టాప్​ న్యూస్​ @3PM

  • గెజిట్​ నోటిఫికేషన్​ అమలుపై చర్చ 

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్.కె.పిళ్లై నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంపై చర్చిస్తున్నారు. 

  • వ్యాక్సిన్​ మైత్రి 2.O

వ్యాక్సిన్​ మైత్రిలో(Vaccine Maitri) భాగంగా.. విదేశాలకు కొవిడ్​ టీకా డోసులను ఎగుమతిని భారత్ తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మయన్మార్​, నేపాల్, బంగ్లాదేశ్​కు 10 లక్షలు చొప్పున కొవిషీల్డ్​ టీకాలు అందించగా.. ఇరాన్​కు మూడు లక్షల కొవాగ్జిన్​ డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.

  • నడిసంద్రంలో శిశువు జననం

సముద్ర ప్రయాణం చాలామందికి పడదు అంటుంటారు. సాధారణంగా పెద్దవారే అనారోగ్యానికి గురవుతారు. మరి అలాంటిది అప్పుడే పుట్టిన నవజాత శిశువు తొమ్మిది గంటలపాటు సముద్రంలో ప్రయాణించింది. అయితే ఈ ప్రయాణం ఏదైనా రికార్డు కోసం అనుకుంటే మీరు పొరబడినట్లే.! ఈ ప్రాంతంలో పెరిగిపోతున్న వలసదారుల కష్టాలకు తాజా ఘటన అద్దంపడుతోంది.

  • ఆఫర్లకు నేడే లాస్ట్​

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లు తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్ల గడువు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. పండుగ షాపింగ్​ చేయాలనుకునే వారు.. ఈ ఆఫర్లను వినియోగించుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు? ఆయా సంస్థలు అందిస్తున్న ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇవి..

  • ఓటీటీలో బాలయ్య

హీరో బాలకృష్ణ (Balakrishna talk show) త్వరలోనే ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా' వేదికగా ఓ టాక్​ షోకు హోస్ట్​గా వ్యవహరించనున్నారు. 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​ పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్వీట్​ చేసింది.

13:54 October 10

టాప్​న్యూస్​@ 2 PM

  • శానిటరీ న్యాప్​కిన్స్​ ద్వారా రేవ్​ పార్టీకి డ్రగ్స్​

ముంబయి రేవ్​ పార్టీ కేసులో (Mumbai Rave Party news) తాజాగా మరో విషయం బయటపడింది. ఓ మహిళా నిందితురాలు.. శానిటరీ న్యాప్​కిన్స్​ ద్వారా నౌకలోకి డ్రగ్స్​ను తీసుకెళ్లినట్లు తెలిసింది. పిల్స్​ రూపంలో ఉన్న ఈ డ్రగ్స్​ను ఎన్​సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • డీఆర్‌డీఓ ఛైర్మన్​కి పురస్కారం

డీఆర్​డీఓ ఛైర్మన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి(g Sateesh Reddy) ప్రతిష్ఠాత్మక ఆర్యభట్ట అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులోని యూఆర్‌ఎస్‌సీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి ప్రదానం చేశారు. దేశంలో రక్షణ పరికరాల అభివృద్ధి, ఉత్పత్తి వ్యవస్థలను స్థాపించేందుకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం సతీశ్ రెడ్డి కృషి చేశారని రక్షణ మంత్రిత్వ శాఖ కొనియాడింది.

  • రష్యాలో విమాన ప్రమాదం

విమానం కూలిన ఘటనలో 16 మంది మరణించారు. రష్యాలోని తతర్​స్థాన్​లో(Russia Plane Crash) ఈ ప్రమాదం జరిగింది.

  •  ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు సత్యజిత్(72) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (actor Satyajit films) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

  • టీమ్​ఇండియాలో ఉమ్రాన్​కు చోటు!

ఐపీఎల్​లో హైదరాబాద్​ తరుపున ఆడిన ఉమ్రాన్ మాలిక్​కు అదృష్టం వరించింది. టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 World Cup 2021) టీమ్​ఇండియా నెట్ బౌలర్​గా ఎంపిక చేసినట్లు సమాచారం.

12:50 October 10

టాప్​న్యూస్​@ 1 PM

భారత్​, చైనా చర్చలు

భారత్, చైనా మధ్య 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు(India China Commander Level Talks) ప్రారంభమయ్యాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఉదయం పదిన్నర గంటలకు చర్చలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్‌(Eastern Ladakh Standoff) ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్‌ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

MAA: ఇప్పటివరకు పోలైన ఓట్లు ఇవే!

'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు సినీ ప్రముఖులు పోలింగ్‌ కేంద్రానికి తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 430 ఓట్లు పోలయ్యాయి. 925మంది 'మా' సభ్యులు ఉండగా, అందులో 883మందికి ఓటు హక్కు ఉంది.

ట్రంప్ నిర్ణయంతో ఆందోళనలో చైనా!

ట్రంప్‌(Donald Trump News) మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఓ పని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకొన్న చైనాకు గొంతులో తడారిపోయింది! డ్రాగన్‌ను అంత ఆందోళనకు గురిచేసిన ట్రంప్‌ నిర్ణయం ఏమిటో తెలుసా..?

ఉపాధ్యాయులకు ఎన్​ఐఏ సమన్లు

మైనారిటీలపై దాడులకు సంబంధించి 40 మంది ఉపాధ్యాయులకు సమన్లు పంపింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)(NIA news india). జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న మైనారిటీల హత్యల కేసును స్థానిక పోలీసుల నుంచి అధికారికంగా బదిలీ చేసుకున్న ఎన్​ఐఏ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టింది.

టీమ్​ఇండియాలో ఉమ్రాన్​కు చోటు

ఐపీఎల్​లో హైదరాబాద్​ తరపున ఆడిన ఉమ్రాన్ మాలిక్​కు అదృష్టం వరించింది. టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 World Cup 2021) టీమ్​ఇండియా నెట్ బౌలర్​గా ఎంపిక చేసినట్లు సమాచారం.

11:46 October 10

టాప్​న్యూస్​@ 12 PM

  • కొత్తపల్లి మృతులకు రూ.5 లక్షల పరిహారం

జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. 

  • 'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. 

మా ఎన్నికల పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ కేంద్రం లోపలికి బయటి వ్యక్తులు వచ్చారని నటుడు నరేశ్ ఆరోపించారు. దీంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

  • ఆ అంశంపైనే కీలకచర్చ!

హైదరాబాద్​ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం అయింది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో భేటీకీ.. తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తున్నారు. 

  • కేంద్ర మంత్రి కుమారుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 12 గంటల విచారణ తర్వాత శనివారం రాత్రి ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

  • బాల్‌బాయ్‌ నుంచి ఆర్సీబీ ఆటగాడిగా

జీవితం(rcb player ks bharat) ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ, ఐపీఎల్‌ చాలా మందికి చాలా అవకాశాలిచ్చింది. సద్వినియోగం చేసుకున్నవాళ్లు హీరోలయ్యారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. అలాంటి కోవలోకే వస్తాడు మన తెలుగు తేజం కేఎస్‌ భరత్‌. విశాఖపట్నంలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా సేవలందించిన అతడు.. ఇప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో కీలక ఆటగాడిగా మారాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

10:50 October 10

టాప్​న్యూస్​@11 AM

  • చిరంజీవి కీలక వ్యాఖ్యలు

'మా' ఎన్నికల (MAA Elections 2021) పోలింగ్ కొనసాగుతోంది. అగ్ర సినీతారలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. భవిష్యత్​లో 'మా' ఎన్నికలు (MAA Elections 2021) వాడీవేడీగా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

  • ఓటెవరికి వేశారో చెప్పేసిన బాలయ్య

'మా' ఎన్నికల్లో(maa elections 2021) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బాలకృష్ణ. ఈ ఎలక్షన్స్​లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు తనకు అన్నదమ్ముల్లాంటి వారని అన్నారు.

  • బతుకమ్మా.. నా భర్తను నడిపించమ్మా..!'

బతుకమ్మ పేర్చడానికి టేకుపూల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డ తన భర్త ఆరోగ్యాన్ని బాగుచేయాలని ఓ మహిళ బతుకమ్మ(Women prays to Bathukamma)ను వేడుకుంటోంది. 11 ఏళ్లుగా భర్తకు సపర్యలు చేస్తూ.. కన్నబిడ్డలా కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఓవైపు కుటుంబ భారం.. మరోవైపు భర్తను చూసుకోవాల్సిన బాధ్యతతో నిత్యం తీరికలేకుండా గడుపుతున్న ఆమె.. బతుకమ్మ పండుగ(Bathukamma festival) సందర్భంగా.. బతుకమ్మను పేర్చి తన భర్తను ఆరోగ్యంగా తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తోంది. 

  • పోలీసుల హైఅలర్ట్​!

పండగల వేళ దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీస్ కమిషనర్(Delhi Police Commissioner) రాకేశ్ అస్థానా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్ర కుట్రలను నిరోధించే చర్యలపై చర్చించారు.

  • షాపింగ్‌ చేస్తే సినిమా టిక్కెట్లు ఫ్రీ.. 

కరోనా మహమ్మారి భయంతో థియేటర్ల(Cinema Theaters)కు దూరమైన ప్రేక్షకులను రప్పించేందుకు ఎగ్జిబిటర్లు నానారకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారాంతాల్లో కళకళలాడుతున్న థియేటర్లు.. సోమ నుంచి గురువారాల్లో వెలవెలబోతున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనూ సినిమా సందడి కనిపించేలా.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎగ్జిబిటర్లు రకరాల డీల్స్ ఆఫర్ చేస్తున్నారు.

09:57 October 10

టాప్​న్యూస్​@ 10AM

  • వృద్ధ దంపతులకు నిప్పు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం జరిగింది. వృద్ధ దంపతులపై దుండగుడు పెట్రోల్ పోసి  నిప్పుపెట్టాడు. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. 

  • పూరీ ఆలయంలో బాలిక​పై...

పూరీ జగన్నాథుడి ఆలయంలో దారుణం జరిగింది. దైవ దర్శనం కోసం వచ్చిన బాలికపై ఆలయంలో పని చేసే ఓ పూజారి లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు.

  • పసిడి ధర ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్థిరంగా ఉంది. వెండి ధరలో(Silver price today) కూడా ఎలాంటి మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • 'హృతిక్​ రోషన్​ అంటారు'

తెలుగు చిత్రసీమలో(pellisandadi movie) వారసుల సందడే ఎక్కువ. తారల కుటుంబాల నుంచి వస్తున్న నవతరం తమదైన ప్రతిభను ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. చిత్రసీమకి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. వందకిపైగా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు శ్రీకాంత్‌ వారసుడు రోషన్‌ కూడా ఇప్పటికే తెరకు పరిచయమయ్యాడు. తాజాగా తన తండ్రి చేసిన 'పెళ్లిసందడD' పేరుతోనే ఓ సినిమా చేశాడు. అప్పటి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు(raghavendra rao pelli sandadi), నేటి చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం.

  • బింద్రా మళ్లీ షూట్ చేయరా?

విజయం అంటే పూర్తిగా వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే అని బీజింగ్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రా అన్నారు(abhinav bindra gold medal). స్వర్ణం సాధించాక తాను మళ్లీ షూట్‌ చేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో తెలిపారు. 

08:53 October 10

టాప్​న్యూస్​@ 9AM

  • 'మా' పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

'మా' పోలింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీరుపై మంచు విష్ణు మెంబర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్‌ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.

  • తెలుగు రాష్ట్రాలు అంగీకరించేనా?

కృష్ణా, గోదావరి బోర్డుల (KRMB, GRMB)పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు కసరత్తు జరుగుతోంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులు నియమించిన ఉపసంఘాలు... తయారు చేసిన ముసాయిదాపై ఇవాళ చర్చించనున్నారు. తుది నివేదికను 12వ తేదీన జరిగే బోర్డు సమావేశం ముందు పెట్టనున్నారు. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోనుంది. ఇవాళ జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనికి ఏమేరకు సమ్మతి తెలుపుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

  • కాంగ్రెస్​కు కేంద్ర మంత్రి చురకలు!

ప్రేమ వ్యవహారంలో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొంతమంది ఆ యువకుడిని కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

  • 100 మంది మృతి!

కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో(Congo Boat Accident) 100 మందికిపైగా మృతి చెందడమో, గల్లంతవడమో జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 61 మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు.

  • రూ.750 కోట్లతో వెబ్​సిరీస్!

భారీ బడ్జెట్​తో సరికొత్త కోణంలో రామాయణం వెబ్​ సిరీస్​ను ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారీ రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో ​​రామ, రావణులుగా రణ్​బీర్​ కపూర్‌, హృతిక్‌ రోషన్‌ నటించబోతున్న తెలుస్తోంది. దీనికోసం వారిద్దరికి చెరో రూ.75 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం.

07:50 October 10

టాప్​న్యూస్​@ 8AM

  • ఇంటి గోడ కూలి... ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. 

  • 'అట్ల బతుకమ్మ'.. ప్రత్యేకతలు

పూలపండుగ సంబురాలతో రాష్ట్రంలో సందడి (bathukamma celebrations in telangana 2021) నెలకొంది. ఊరూవాడలు పూలవనాలుగా మారుతున్నాయి. పెత్రమాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఇవాళ ఐదో రోజు సందర్భంగా... బతుకమ్మను(Bathukamma day 5) ఎలా పేరుస్తారు? ఏం నైవేద్యం సమర్పిస్తారో? తెలుసుకుందాం రండి...

  • మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ ధరల (Petrol Price) నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్​లో (Petrol Price today Hyderabad) లీటర్ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెరిగింది. ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి..

  • 'రైతులంతా ధనికులవుతారా?'

దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా భరోసా కల్పించాలని డిమాండ్‌ చేసిన మోదీ.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మరోవైపు లఖింపుర్‌ ఖేరి హింస ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే జరిగిందని.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రను పదవి నుంచి తొలగించాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు.

  • దిల్లీ కుర్రాళ్లు ఢీకొట్టగలరా?

సీనియర్లతో నిండి 'డాడీస్‌ ఆర్మీ'గా పేరు తెచ్చుకున్న జట్టు ఓ వైపు.. యువ ఆటగాళ్లతో ఉరకలెత్తుతున్న బృందం మరో వైపు! ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన జట్టు ఒకటి.. గత మూడు సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమ్‌ ఇంకోటి.. ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టు అటు.. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పోరాడుతున్న జట్టు ఇటు! ఇప్పుడా రెండు జట్లు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఫైనల్లో చోటు కోసం తలపడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్​ 10) తొలి క్వాలిఫయర్‌లో పోటీపడనున్న ఆ జట్లే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌.మరి ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టేదెవరో చూడాలి. ఓడిన జట్టుకు టైటిల్‌ పోరు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.

07:10 October 10

టాప్​న్యూస్​@7 AM

  • 'మా' ఎన్నికల్లో గెలిచి నిలిచేది ఎవరు?

మా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు.. తాడోపేడో తేల్చుకోనున్నారు. మరి వీరిద్దరిలో గెలిచి నిలిచేది ఎవరు?

  • మలేరియాకు భారత్‌ బయోటెక్‌ టీకా

హైదరాబాద్​లోని భారత్‌ బయోటెక్‌(Bharat Biotech) ఇంటర్నేషనల్‌ మలేరియాటీకా(Bharat biotech malaria vaccine) ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్‌కే భాగస్వామ్యంతో టీకా(Bharat biotech malaria vaccine) అందించనున్నట్లు డాక్టర్‌ రేచస్‌ ఎల్ల ‘ట్విటర్‌’లో వెల్లడించారు.

  • ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌

అసోంలోని నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారంలో (Nagaon Central jail) భారీ సంఖ్యలో హెచ్​ఐవీ (HIV among prisoners) కేసులు వెలుగుచూశాయి. ఖైదీలకు సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించగా.. 85 మంది ఫలితాలు పాజిటివ్​గా వచ్చాయి. 

  • బైడెన్‌ కీలక నిర్ణయం!

గ్రీన్‌ కార్డుల జారీ విధానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో అసాధారణ జాప్యాలను బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

  • పాజిటివ్‌ వస్తే పది రోజుల ఐసొలేషన్‌

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభంకాబోతుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న తర్వాత జరగనున్న తొలి మెగాటోర్నీ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో టోర్నీ(t20 world cup schedule) కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఐసీసీ సమగ్రత, బయో రక్షణ విభాగాధిపతి అలెక్స్‌ మార్షల్‌. పాజిటివ్​ వచ్చిన వారిని పది రోజుల పాటు ఐసోలేషన్​లో ఉంచనున్నట్లు తెలిపారు.

05:32 October 10

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • నేటి నుంచే కీలక సమావేశాలు

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నేటి నుంచి కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. ఉపసంఘాలతో ప్రారంభించి పూర్తి స్థాయి బోర్డుల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఆర్టీఎస్​తో పాటు పెద్దవాగు ప్రాజెక్టులు 14వ తేదీ నుంచి బోర్డుల నిర్వహణలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • 'పోడు భూముల కార్యాచరణ చేపట్టాలి'

పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించారు. రాష్ట్రంలోని పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

  • కొనసాగుతున్న విమర్శల పర్వం

హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ఒకరికి మించి మరొకరు ప్రచారాలు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక సెమీఫైనల్‌గా భావిస్తుండటంతో పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం, ధూంధాం కార్యక్రమాలతో ప్రచారం వాడివేడీగా సాగుతోంది.

  •  వారికి గుడ్​న్యూస్ 

కొత్త వృద్ధాప్య పింఛన్ల (Old Age Pensions) మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

  •  మలేరియాకు  టీకా.

హైదరాబాద్​లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మలేరియాటీకా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్‌కే భాగస్వామ్యంతో టీకా అందించనున్నట్లు డాక్టర్‌ రేచస్‌ ఎల్ల ‘ట్విటర్‌’లో వెల్లడించారు.

  • కేంద్రమంత్రి కుమారుడు అరెస్ట్​

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లఖింపుర్‌ ఖేరీ ఘటనలో తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సుమారు 11 గంటల పాటు ప్రశ్నించారు.

  • నేడే  సైనిక చర్చలు

భారత్- చైనా మధ్య 13వ విడత సైనిక చర్చలు (India China border) నేడు జరగనున్నాయి. హాట్​స్ప్రింగ్​ వద్ద ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలపై (India China standoff) ఇరుదేశాల సైనికాధికారులు చర్చించనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

  •  సీబీఐ చీఫ్‌కు  సమన్లు

ఫోన్ ట్యాపింగ్, సమాచార లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ సుబోధ్‌కుమార్‌ జైశ్వాల్​కు (Subodh Jaiswal Cbi Chief) ముంబయి సైబర్‌ సెల్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 14 న విచారణకు హాజరు కావాలని కోరినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

  • కూలిన ఎయిర్​ ఫోర్స్​ విమానం

ఈశాన్య బొలివియాలోని అమెజాన్​ ఆడవుల్లో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. కూలిన విమానం బొలివియా ఎయిర్​ఫోర్స్​కు చెందిందిగా పోలీసులు గుర్తించారు.

  •  ఇదేమి  బాదుడు?

పెట్రో ధరలతో నిత్యావసర ఉత్పత్తులు రెక్కలు తొడుక్కుని ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లోనే రెండొందల రూపాయలకు పైగా ఎగబాకిన గ్యాస్‌బండ వెలతో (Lpg Gas Cylinder Price) వంటింటి బడ్జెట్లన్నీ తలకిందులైపోతున్నాయి.

Last Updated : Oct 10, 2021, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.