1. కరోనాపై మోదీ సమీక్ష.. పాల్గొన్న సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలను ప్రధానికి వివరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. యశోద ఆస్పత్రిలో కరోనా రోగి బలవన్మరణం
హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 6న యశోద ఆస్పత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న నేపథ్యంలో గది లోపలి బాత్రూంలో ఉరి వేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. గిరిపుత్రుల భూమికి ఎసరు.. తెలియకుండానే క్రయ విక్రయాలు
వారంతా కాయకష్టం చేసుకుని జీవించే గిరిపత్రులు. మంచిర్యాల జిల్లాలో గత 65 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి ఇప్పడు వారిది కాదంటూ కొందరు అడ్డుపడుతున్నారు. దీంతో సాగుభూమిని లాక్కుంటే తామేలా బతికేది అంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. పొరుగుసేవల ఏజెన్సీల ఎంపికలో నిబంధనల ఉల్లంఘన
ఆదిలాబాద్ జిల్లాలో పొరుగు సేవల ఏజెన్సీల ఎంపికలో అధికార యంత్రాంగం పారదర్శకతకు పాతరవేసింది. ఆరోపణలన్నింటినీ పక్కనపెట్టి కొందరికి అనుకూలమైన ఏజెన్సీలను ఎంపిక చేసింది. నిబంధనలను సైతం అమలుచేయలేదు. గుత్తేదారుల సమక్షంలోనే టెండర్ ప్రక్రియను ముగించాల్సి ఉండగా దాదాపుగా పాతికరోజుల తరువాత రహస్యంగా ఏకపక్షంగా ఎంప్యానల్‌మెంట్ ఏజెన్సీలను ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానం.. మెరుగుపడనున్న పారదర్శకత
పంచాయతీలకు మంజూరయ్యే నిధులు.. చేస్తున్న ఖర్చు లెక్కలు పక్కాగా ఉంటేనే నిర్దేశించిన లక్ష్యం నెరవేరుతుంది.. ఇలా జరగాలంటే ఆడిట్ సరిగా జరగాలి. ఇందుకోసం పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 370 పంచాయతీలను ఎంపిక చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. 'ఉపరాష్ట్రపతి పదవికే ఆయన వన్నెతెచ్చారు'
ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నెతెచ్చారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. తక్కువ సమయంలోనే చాలా విషయాలపై వెంకయ్య పట్టుసాధించారని పేర్కొన్నారు. దాదాపు ప్రతి సందర్భంలో సంయమనంతో వ్యవహరించేవారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్‌నాథ్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. రేపు కొవిడ్ వ్యాక్సిన్ నిపుణుల కమిటీ భేటీ.
కొవిడ్ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం సమావేశం కానుంది. కొవిడ్ వ్యాక్సిన్ సేకరణ, రవాణా సహా ఇతర అంశాలపై నీతిఆయోగ్ సభ్యుడు వీకీ పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ చర్చించనుంది. సమావేశంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు పాల్గొననున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'
నిరుద్యోగం, పేదరికంలో ఉన్నవారికి చేయూతనిచ్చేలా కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీటిని అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్నారు. పేదల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. 'మేం కలిసే ఉన్నాం.. మా సోదరభావం కొనసాగుతుంది'
కాంగ్రెస్‌లో సోదరభావం కొనసాగుతూనే ఉంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారన్నారు. ప్రభుత్వ విభాగాలను భాజపా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, ఇవాళ జరగాల్సిన శాసనపక్ష సమావేశాన్ని భాజపా వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. 'శ్వాసప్రక్రియలో లోపాలుంటే శరీరం పనితీరు మందగిస్తుంది'
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య ఈ రెండింటినీ గమనిస్తే ఎవరిలో అయినా కంగారు పుట్టక మానదు.! ఐతే అలాంటి ఆందోళన, భయానికి కొవిడ్ సోకినవారు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అనవసరంగా కలిగే భయాందోళనలు శ్వాసప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపి కోలుకునే వారిని సైతం ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.