ETV Bharat / city

తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్​ సమావేశం - టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం

cm kcr
cm kcr
author img

By

Published : Jan 8, 2020, 4:16 PM IST

Updated : Jan 8, 2020, 6:36 PM IST

16:14 January 08

మున్సిపల్​ ఎన్నికలపై రేపు తెరాస సమావేశం

తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్​ సమావేశం

    పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, బీ ఫారాల పంపిణీపై తెరాస ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ రేపు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్​లో జరగనున్న సమావేశానికి అభ్యర్థులకు ఇవ్వాల్సిన బీ ఫారాలను.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు రేపు అందజేయనున్నారు.

    ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జీలకు ఏ ఫారాలను తెరాస ప్రధాన కార్యాదర్శి శ్రీనివాసరెడ్డి అందజేయనున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లి... ఎంపిక చేసిన కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేస్తారు. ఏ ఫారం, బీ ఫారాలకు సంబంధించిన విధి విధానాలను కేసీఆర్ వివరించనున్నారు. 

    అభ్యర్థుల ఖరారులో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు... పోటీ తీవ్రంగా ఉన్నందున... టికెట్ దక్కని వారు అసంతృప్తికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్​లకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపుతో పాటు... మేయర్, ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకూ వ్యవహరించాల్సిన తీరును పార్టీ శ్రేణులకు కేసీఆర్ వివరిస్తారు.

Last Updated : Jan 8, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.