కేంద్రంపై పోరుబాట పట్టిన తెరాస... హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నేడు మహాధర్నా(trs maha dharna) నిర్వహించనుంది. యాసంగిలో ధాన్యం కొంటారో(paddy procurement in telangana).. లేదో...? స్పష్టతివ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 12న నియోజకవర్గాల కేంద్రాల్లో తెరాస ధర్నా(trs dharna)లు కూడా నిర్వహించింది. 50 రోజులు దాటిన కేంద్రం నుంచి స్పష్టత కరవైందని మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్(kcr press meet)లో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in telangana)పై స్పష్టతనివ్వాలని బుధవారం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ(kcr letter to modi) కూడా రాశారు.
తెరాస ప్రజాప్రతినిధులంతా..
ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ఇవాళ మహాధర్నా చేయాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇందిరాబాద్ పార్కు వద్ద ధర్నాచౌక్‌లో తెరాస ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్ పర్సన్లు, రైతుబంధు సమితి జిల్లా ఛైర్మన్లు ధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాస ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 2019లో మహబూబ్‌నగర్ జిల్లా బూర్గుల వద్ద కేటీఆర్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించింది. ఇవాళ్టి ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
రెండు మూడు రోజుల్లో నిర్ణయం..
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెరాస స్పష్టం చేస్తోంది. ధర్నా తర్వాత కేంద్రం నుంచి స్పందనను చూసి.. రాష్ట్రంలో పంటల విధానంపై రెండు, మూడు రోజుల్లో విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు, వరి సాగు వ్యవహారంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తామని.. వారి నుంచి ఉలుకు పలుకు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు స్పష్టమైన వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. అన్ని వేదికలపైనా కేంద్రం తీరును నిలదీస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన 500మంది నేతలు ధర్నాలో పాల్గొంటున్న నేపథ్యంలో.. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: