ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - horoscope in Telugu

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Today horoscope
Today horoscope
author img

By

Published : May 2, 2021, 4:27 AM IST

మేషం

శుభయోగముంది. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. వస్త్రలాభం, ధనప్రాప్తి, సుఖసంతోషాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితముంటుంది. వ్యాపారం లాభిస్తుంది. చిన్న విఘ్నాలున్నా అంతిమంగా మేలు జరుగుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. వారాంతంలో మంచివార్త వింటారు. కేతుశ్లోకం చదువుకుంటే మంచిది.

వృషభం

ముఖ్యకార్యాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ధైర్యం చాలా అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయాలి. నలుగురినీ కలుపుకుపోవాలి. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు పని చేస్తాయి. ఒంటరి పోరాటం పనికిరాదు. తగినంత విశ్రాంతి అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి. ధర్మం కాపాడుతుంది.

మిథునం

అదృష్టకాలం మొదలైంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో కలిసివస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఆదాయవనరులు పెరిగే సూచన ఉంది. క్రమంగా పలుమార్గాల్లో సంపాదన లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇంట్లో శాంతి, సుఖం లభిస్తాయి. మిత్రుల అండ ఉంటుంది. వాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.

కర్కాటకం

ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపార విజయం ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్తపడాలి. ఆవేశపరిచే వారున్నారు. సందర్భాన్నిబట్టి వ్యవహరించాలి. మితభాషణం ఉత్తమం. దత్తాత్రేయ స్వామి స్మరణ శుభప్రదం.

సింహం

శుభకాలం నడుస్తోంది. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. అధికారలాభముంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ధర్మమార్గంలో విజయముంటుంది. ఆటంకాలు తొలగుతాయి. ఎదురుచూస్తున్న పని అవుతుంది. ఆదిత్యహృదయం చదవండి, శుభవార్త వింటారు.

కన్య

ప్రయత్నపూర్వకంగా పనులు అవుతాయి. ఆర్థికాంశాలు బాగున్నాయి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. దేనికీ తొందరవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. మౌనం మేలుచేస్తుంది. సానుకూల ఫలితం సూచితం. సూర్యస్తోత్రం చదివితే శుభం.

తుల

బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. వృథా ప్రయాస లేకుండా తగిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేయండి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఒత్తిళ్లను తట్టుకుంటారు. ఒక సమస్య మనసును ఇబ్బంది పెడుతుంది. మిత్రులవల్ల పరిష్కారం లభిస్తుంది. పట్టువిడుపులతో ముందుకు సాగండి. కలహాలకు దూరంగా ఉండాలి. శివారాధన మేలుచేస్తుంది.

వృశ్చికం

ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మొహమాటం కొంత ఇబ్బందిపెడుతుంది. విజ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగితే కోరుకున్న జీవితం లభిస్తుంది. దేనికీ వెనుకాడవద్దు. మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. శివారాధన మంచిది.

ధనుస్సు

శుభాలు జరుగుతాయి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. స్వల్ప విఘ్నాలున్నా సకాలంలో పనిచేస్తే విజయం ఉంటుంది. వ్యాపారస్తులకు శుభం జరుగుతుంది. కొందరివల్ల నష్టం జరగవచ్చు. చాకచక్యంగా వ్యవహరించాలి. ఆర్థికాంశాలు సహకరిస్తాయి. ఇష్టదైవస్మరణ శ్రేయోదాయకం.

మకరం

అభివృద్ధి సూచితం. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా పనులు మొదలెట్టండి. తొందరవద్దు. లోతుగా ఆలోచించండి. ఆర్థికస్థితి గతంకన్నా మెరుగవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను సమర్థతతో పూర్తి చేయగలుగుతారు. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం

అద్భుతమైన శుభయోగాలున్నాయి. కోరుకున్నది లభిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు. అధికార లాభం సూచితం. సుస్థిరమైన ఫలితాలున్నాయి. శక్తికి మించి శ్రమించండి. శత్రువులు మిత్రులవుతారు. బంధువుల అండ లభిస్తుంది. ఆర్థికనష్టం సూచితం. కుటుంబసభ్యులతో కలిసి చేసే పనులు లాభాన్నిఇస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం

అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో సౌమ్య సంభాషణతో సత్ఫలితాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సామరస్య ధోరణితో పనిచేస్తే సరిపోతుంది. ఆర్థికంగా మంచి ఫలితముంటుంది. సుఖసౌఖ్యాలున్నాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.