ETV Bharat / city

AP corona cases: ఏపీలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 13,474 కరోనా కేసులు, 9 మరణాలు - AP Today corona bulletin

AP corona cases today: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,474 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 9 మంది మరణించారు. కొత్తగా 10,290 మంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

AP corona cases
ఏపీ తాజా కరోనా కేసులు
author img

By

Published : Jan 27, 2022, 7:08 PM IST

AP corona cases today: ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలు పరీక్షించగా.. 13,474 మందికి కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ అయింది. వైరస్​ బారిన పడి కొత్తగా 9 మంది మరణించారు.

మహమ్మారి నుంచి కొత్తగా 10,290 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,09,493 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

దేశంలో..

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,03,71,500
  • మొత్తం మరణాలు: 4,91,700
  • యాక్టివ్ కేసులు: 22,02,472
  • మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,22,726 మందికి కరోనా సోకింది. 10,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,29,39,500కి చేరగా.. మరణాల సంఖ్య 56,45,188కు పెరిగింది.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్​ ట్రస్టు సేవలు.. కొవిడ్​ బాధితులకు టెలీమెడిసిన్​ సాయం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.