కరోనా చికిత్సకు 22 ప్రైవేటు వైద్య కళాశాలలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మందుల కొరత లేదని పేర్కొన్నారు.
కరోనా బాధితులకు సాధారణ చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో 80 వేల పీపీఈ కిట్లు నిల్వ ఉన్నాయి. మరో 5 లక్షల పీపీఈ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చాం. లక్షకు పైగా ఎన్95 మాస్కులు ఉన్నాయి. 20 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉన్నాయి. మరో కోటి గ్లౌజుల కోసం ఆర్డర్ ఇచ్చాం. మాస్కులు, 5 లక్షల గాగుల్స్ కోసం ఆర్డర్ ఇచ్చాం. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశాం.
- ఈటల రాజేందర్
ఇదీ చూడండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి