నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఉద్యోగుల విభజన త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు టీఎన్జీవోలు తెలిపారు. దీనికి ఉద్యోగ సంఘాలు పూర్తిగా సహకరించాలని కోరినట్టు పేర్కొన్నారు. దిల్లీలో సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలను టీఎన్జీవో ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉద్యోగస్థులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి, ఎంపీలతో టీఎన్జీవో ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగస్థుల ఆరోగ్య పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించుకుని.. త్వరితగతిన ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని టీఎన్టీవోలకు సీఎం సూచించారు.
గచ్చిబౌలిలో భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ సంబంధించిన స్థలాన్ని త్వరలో ఉద్యోగులకు కేటాయించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి టీఎన్జీవో సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఇన్‌కం టాక్స్ రాయితీని రూ. 2లక్షల 50వేల నుంచి పది లక్షలకు పెంచే విధంగా ప్రస్తావించాలని గౌరవ పార్లమెంట్ సభ్యులకు తెలంగాణ ఎన్జీవో సంఘం విజ్ఞప్తి చేసింది. స్పందించిన కేసీఆర్.. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాలని ఎంపీలకు సూచించారు.
రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌తో పాటు ప్రధానకార్యదర్శి రాయకండి ప్రతాప్, సహ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: