ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెజస ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని... కనీస నియమాలను కూడా పాటించడంలేదని ఆరోపించారు. తాము వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు సోమవారం వరకు కూల్చివేత పనులు చేపట్టరాదని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఆలోచించకుండా రూ. కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ డబ్బును ఆస్పత్రులను అభివృద్ధి చేయడానికి ఖర్చు చేస్తే ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయ కూల్చివేతను ఆపి తీరుతామని... అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఐకమత్యం, ధైర్యంతోనే వైరస్‌పై విజయం'