ETV Bharat / city

'న్యాయమైన డిమాండ్లతో బంద్​ నిర్వహిస్తే.. అరెస్టులు చేయిస్తారా..?' - bharat bandh in telangana

భారత్ బంద్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఖరిని నిరసిస్తూ... హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించాయి. ఈ నెల 30న కలెక్టర్లకు విజ్ఞానపన పత్రం ఇవ్వడంతో పాటు... అక్టోబరు 5న పొడు భూముల సమస్యలపై రాస్తారోకో నిర్వహిస్తామని కోదండరాం పేర్కొన్నారు.

tjs leader kodandaram on arrests in bharat bandh

author img

By

Published : Sep 28, 2021, 7:46 PM IST

'న్యాయమైన డిమాండ్లతో బంద్​ నిర్వహిస్తే.. అరెస్టులు చేయిస్తారా..?'

న్యాయమైన డిమాండ్లపై భారత్ బంద్ నిర్వహిస్తే... అరెస్టులు చేయించిన తీరు సరైంది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. భారత్ బంద్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఖరిని నిరసిస్తూ... హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించాయి. 10 వేల మందికి పైగా అరెస్ట్ అయినా.. బంద్ విజయవంతం అయ్యిందని కోదండరాం తెలిపారు. ఈ నెల 30న కలెక్టర్లకు విజ్ఞానపన పత్రం ఇవ్వడంతో పాటు... అక్టోబరు 5న పొడు భూముల సమస్యలపై రాస్తారోకో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నిన్న భారత్ బంద్​లో భాగంగా హయత్​నగర్ బస్​డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్​తో సహా వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కోదండరాం అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తల ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ ప్రవేశం దగ్గరికి రాగా... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెజస కార్యకర్తలను అదుపులోకి తీసుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

పోడు భూముల విషయంలో ప్రజల్ని సంఘటితం చేస్తున్నందుకే కోదండరామ్‌పై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందని తెజస నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాంపై దాడి అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద దాడి అని వారు అన్నారు. కేసీఆర్ కోదండరాంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇదీ చూడండి:

Bharat Bandh in Telangana: రాష్ట్రంలో బంద్‌ ప్రశాంతం.. పలువురు నేతల అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.