ఆరేళ్ల కాలాన్ని తెరాస ప్రభుత్వం వృథా చేసిందే తప్ప.. అభివృద్ది ఏ మాత్రం చేయలేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా... కేవలం భవనాల కూల్చివేతలకే సమయం కేటాయించారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడించిన మేనిఫెస్టోలో ఒకటి రెండు ఆంశాలు తప్ప.. అన్ని పాతవేనని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేసిన బడ్జెట్ లెక్కల్లోనూ... అబద్దాలే చెబుతున్నారని ఆక్షేపించారు. నగర ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోదండరాం కోరారు.