ETV Bharat / city

రద్దయిన రైలు టికెట్లకు పూర్తి రీఫండ్

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ దృష్ట్యా అన్ని రైళ్లు రద్దయ్యాయి. టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్​ ఇవ్వనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ఉద్యోగులు, సిబ్బందికి రక్షణ పరికరాలు కూడా సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ticket charges reund for cancel trains
రద్దైన రైలు టికెట్లకు పూర్తి రీఫండ్
author img

By

Published : Mar 29, 2020, 5:53 AM IST

టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు పూర్తిస్థాయిలో రీఫండ్​ అందజేస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 మధ్య కాలంలో టికెట్లు రద్దు చేసుకున్నవారికి ఈ సదుపాయం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్యఅధికారి రాకేష్ పేర్కొన్నారు. కొవిడ్-19ని అరికట్టడంలో భాగంగా ప్రీమియం, మెయిల్, ఎక్స్​ప్రెస్​, ప్యాసింజర్, సబర్బన్, కోల్​కత్తా మెట్రో రైళ్లు, కొంకణ్ రైళ్లు రద్దు చేశారు. రద్దయిన రైళ్లకు 100 శాతం రీఫండ్​ ఇస్తామన్నారు. ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్నవారికి రైళ్లు రద్దయిన తర్వాత అటోమెటిక్​గా ఖాతాలో జమవుతుందన్నారు. కౌంటర్ల ద్వారా తీసుకున్నవారికి ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల లోపు రీఫండ్​ తీసుకునే వెసులుబాటు కల్పించారు.

రవాణాలో రికార్డు

భారతీయ రైల్వే నిర్ణయానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే గూడ్స్​, పార్సిళ్లలో సరుకు రవాణా చేయడానికి డేమరేజ్, వార్ఫేజ్ ఛార్జీలు విధించకూడదని నిర్ణయించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అందకు ముందు 50 శాతం టారిఫ్​ విధించాలనుకున్నప్పటికీ... ఆ తర్వాత ఏ మాత్రం తీసుకోవద్దని నిర్ణయించారు. మార్చి 22 నుంచి 26 వరకు సగటున రోజుకు 1.70మిలియన్ టన్నుల చొప్పున మొత్తం 10.17 మిలియన్ టన్నుల సరకుల రవాణా చేసిందనట్టు తెలిపారు. సుమారు 270 గుడ్స్​ రైళ్లు నడపడం ద్వారా ఈ రికార్డు సాధించామన్నారు.

సిబ్బంది రక్షణే ముఖ్యం

ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును, వ్యవసాయ రంగానికి ఎరువులు, ఆహారధాన్యాలు, రేణిగుంట నుంచి దిల్లీకి పాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఆపరేటింగ్, భద్రత, రక్షణ, ట్రాక్ నిర్వహణ, కమర్షియల్ వంటి రైల్వే విభాగాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్​తో పాటు శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు సరఫరా చేస్తున్నారు. సిబ్బంది పనిచేసే స్థలాలు, విశ్రాంతి గదుల, షెడ్ల పరిసరాలను నిరంతరంగా క్రిమి సంహారకాలతో శుభ్ర పరుస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.