ETV Bharat / city

దుర్బుద్ధితోనే మాకు రాత్రి వేళ నోటీసులు : అమరావతి రైతులు - THULLOORU POLICE ISSUED NOTICES TO AMARAVATHI FARMERS VIJAYAWADA ANDHRA PRADESH

ఏపీ రాజధాని రైతులకు తుళ్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమించి నినాదాలు చేస్తున్నారనే అభియోగంపై రాత్రి వేళలో నోటీసులిచ్చారు. ఇదంతా కేవలం రాజధాని అమరావతి అంశాన్ని అణగదొక్కే ప్రయత్నమేనని ప్రభుత్వంపై బాధిత రైతులు మండిపడ్డారు.

ధర్నా చేస్తున్నారని... రాజధాని రైతులకు నోటీసులు

author img

By

Published : Apr 13, 2020, 7:58 PM IST

Updated : Apr 13, 2020, 9:34 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి నినాదాలు చేస్తున్నారంటూ వెంకటపాలెంలోని 12 మందికి తుళ్లూరు పోలీసులు రాత్రి సమయంలో నోటీసులు జారీచేశారు. సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 పోలీస్ యాక్టు అమల్లో ఉన్నందున బయట తిరగడం, పలువుర్ని కలవడం లాంటివి చేయడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు అందించారు. చట్టాన్ని అతిక్రమించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఐ శరత్‌బాబు ధ్రువీకరించారు.

మమ్మల్ని భయపెట్టేందుకే : రైతులు

ఇళ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేస్తున్నామని, తమను భయభ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి అంశాన్ని అణగదొక్కేందుకే పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు, వాలంటీర్లు గ్రామాల్లో పర్యటిస్తూ లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తున్నా, ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్న యత్నమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రమేశ్‌ కుమార్‌కు మద్దతివ్వాలి..

రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి కాపాడిన రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు పేర్కొన్నారు.

రమేశ్‌ కుమార్‌ చర్య వల్లే ఆంధ్రప్రదేశ్‌ శవాల దిబ్బగా మారకుండా ఆగిందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ‘థ్యాంక్యు రమేశ్‌కుమార్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు.

117వ రోజుకి చేరుకున్న అమరావతి ఆందోళనలు

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు 117వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, దొండపాడు తదితర గ్రామాల్లో ఇళ్ల ముందు, వీధుల్లో నిరసనలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి సుదీక్షన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షురాలు చిగురుపాటి విమల మాస్కులు పంపిణీ చేశారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా రాత్రి 7 గంటలకు ఇళ్లలోని విద్యుత్తు దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలపాలన్నారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలి..
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ప్రధాని మోదీకి అమరావతి దళిత రైతులు లేఖ రాశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి.. రోడ్డున పడి.. గత 117 రోజుల నుంచి ఆర్థికంగా, మానసికంగా, పోలీసుల దెబ్బలతో గాయపడ్డామన్నారు. లాక్​ డౌన్ కిష్ట కాలంలో ఇళ్లలోనే దీక్ష కొనసాగిస్తున్నామని ప్రధాని దృష్టికి తెచ్చారు. దళిత రైతుల పట్ల దయ ఉంచి 30%-40% కౌలు పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : ప్రపంచదేశాలకు భారత్​ 'సంజీవని'గా ఎలా మారింది?

Last Updated : Apr 13, 2020, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.