ETV Bharat / city

కరోనా బ్యాచ్​ అయినా.. ఇంటర్​లో సత్తా చాటారు..

author img

By

Published : Jun 29, 2022, 3:30 AM IST

Inter Results: రెండేళ్ల పాటు కరోనా ఆగం చేసినా... ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత మళ్లీ సాధారణ స్థితికి చేరింది. మెుదటి సంవత్సరంలో 63.32 శాతం, సెంకడియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా... గురుకుల విద్యాసంస్థల్లో ఎక్కువ మంది పాసయ్యారు. కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలోనూ మంచి ఫలితాలు వచ్చాయి. మరోవైపు పలుచోట్ల ఫెయిల్‌ అయిన విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులెవరూ బలిదానాలు చేసుకోవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Inter Results
Inter Results

Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేటు కళాశాలల కన్నా గురుకుల విద్యాసంస్థల్లో ఎక్కువ ఉత్తీర్ణత శాతం లభించింది. మొదటి సంవత్సరంలో గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో 73.30 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. రెండో సంవత్సరంలో ప్రైవేటు కళాశాలల్లో 68.30శాతం మంది ఉత్తీర్ణులు కాగా... గురుకులాల్లో 78.25 శాతం నమోదైంది. ఎస్సీ గురుకులాల్లో 88.03శాతం మొదటి సంవత్సరం విద్యార్థులు పాసయ్యారు. 41 శాతం ఎస్సీ గురుకులాల్లో వందశాతం ఫలితాలు వచ్చాయి.

బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరం 86.14శాతం, సెంకడియర్‌లో 93.84శాతం ఉత్తీర్ణత నమోదైంది. వందకుపైగా విద్యార్థులు 950 మార్కులు సాధించారు. రాష్ట్రంలోని 172 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సెంకడియర్‌లో 86.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నిర్మల్‌ జిల్లా సోఫీనగర్‌లోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో మెుదటి సంవత్సరం చదువుతున్న ధనుష్క... రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. 470 మార్కులకుగాను 468 మార్కులు సంపాదించింది.

ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని బలవన్మరణం చేసుకున్నారు. కాటేదాన్‌కు చెందిన అరవింద్‌ రెడ్డి... ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో రెండంతస్తుల భవనం నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలై చనిపోయాడు. చింతల్‌బస్తీ వాసి గౌతంకుమార్‌... ఉత్తీర్ణత సాధించినప్పటికీ తక్కువ మార్కులు వచ్చాయని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోగా... తల్లి కూరగాయలు అమ్మి కుమారుడిని చదివిస్తోంది. అందివచ్చిన కొడుకు తొందరపాటుగా తనువు చాలించడంతో తల్లి కన్నీరు మున్నీరయ్యింది. బండంగ్‌పేట్‌లోని అన్నపూర్ణనగర్‌లో నివిసిస్తున్న అల్లంపల్లి ఠాగూర్‌ హరి ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన వారికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన్ని డిప్రెషన్‌కి గురికావద్దని.... మరింత ఉత్సాహంతో, నిబద్ధతతో సన్నద్ధమై మరోమారు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఉత్తీర్ణత సాధించని వారికి ఏడాది నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోందని ఈ అవకాశాన్ని విద్యార్ధులు వినియోగించుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యార్ధులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మానసిక ధైర్యం ఇవ్వాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.