ఏపీలో మూడు చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా కేంద్రం గుర్తింపునిచ్చింది. ఆదర్శ స్మారకంగా గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి స్థానం దక్కింది.
ఆదర్శ స్మారకాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదర్శ స్మారకాల్లో వై-ఫై సౌకర్యం, కెఫే, ప్రదర్శన కేంద్రం, లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం లభించిందని ప్రకటించారు. రాష్ట్రంలోని 135 కేంద్ర రక్షిత కట్టడాల్లో మౌలిక వసతులు పెంచుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: