తూర్పు గోదావరి జిల్లా పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ 17వ నంబరు గేటు వద్ద ఒకటి ... పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరొకటి... కచ్చులూరు వద్ద ఇంకొకటి ... ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు వచ్చిన మరో మృతదేహం కలుపుకొని మొత్తం 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. 315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఉండడంతో... గాలింపునకు ప్రతికూలంగా మారాయి.
ఇదీ చూడండి: బోటు ప్రమాదం... ఇంకా దొరకని 35 మంది ఆచూకీ