ETV Bharat / city

శాంతించిన గోదారి.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ వార్తలు

Dhawaleshwaram: ఏపీలో ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం మరిత తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించిన అధికారులు.. వరద తగ్గుముఖం పట్టడంతో ఉపసంహరించారు.

Godavari - Dhawaleswaram
Godavari - Dhawaleswaram
author img

By

Published : Jul 19, 2022, 4:44 PM IST

Dhawaleshwaram: ఆంధ్రప్రదేశ్​లోని ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 17.7 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం నుంచి పంటకాల్వలకు 5,250 క్యూసెక్కులు విడుదల చేయగా.. సముద్రంలోకి సుమారు 19 లక్షలు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

లంకలు విలవిల: కోనసీమ జిల్లాలోని 18 మండలాల్లో 70 గ్రామాలు, 104 ఆవాస ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాధితుల కోసం 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 22 గ్రామాల్లో అంధకారం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 19 చోట్ల ఏటిగట్లు బలహీనపడ్డాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో 45 వరద ప్రభావిత గ్రామాలుండగా.. ఎనిమిది గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తాయి. రాజోలు మేకలపాలెం నుంచి నున్నవారిబాడువ వరకు జలదిగ్బంధంలో ఉంది. గట్టుపక్కన ముంపునకు గురైన బాధితులు 30 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు.

  • పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 15 లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నరసాపురం మాధవాయపాలెం వద్ద గట్టుకోతకు గురవడంతో యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు. పాలకొల్లు-నరసాపురం ప్రధాన రహదారిపై వరద కొనసాగుతోంది.
  • ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఇంకా తేరుకోలేదు. ఈ మండలాల్లోని 80కి పైగా అవాస ప్రాంతాలు చీకటిలోనే మగ్గుతున్నాయి. 61 గ్రామాలకు చెందిన 126 నివాసిత ప్రాంతాలు ముంపునకు గురయినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 56 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ వర్గాలు తెలిపాయి.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం చింతరేవుపల్లిలో 800 కుటుంబాలు సమీపంలోని గుట్టపై తలదాచుకున్నాయి. సోమవారం కొందరు అధికారులు వెళ్లి 3రేషన్‌కార్డులకు ఒక పాల ప్యాకెట్‌, కార్డుకు రెండు బిస్కెట్లు ఇచ్చారు.
  • పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 35.51 మీటర్లకు చేరుకుంది. 48 గేట్ల నుంచి 17.95 లక్షల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.