బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమబెంగాల్ వైపు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ గురువారం ఓ మోస్తరుగా, శుక్రవారం భారీ వర్షాలు(Telangana Weather Updates) కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మహబూబ్‌నగర్‌లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4.4 డిగ్రీలు తగ్గి బుధవారం పగలు గరిష్ఠంగా 27.1 డిగ్రీలుంది.
గులాబ్ తుపాను తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. మరో రెండ్రోజులు వర్షాలు(Telangana Weather Updates) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు భారీ వర్షాలు(Telangana Weather Updates) కురిస్తే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలూ అప్రమత్తమయ్యారు. ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటున్న వారంతా.. మళ్లీ వానలు(Telangana Weather Updates) కురిస్తే తిప్పలు తప్పవని భయాందోళనకు గురవుతున్నారు.