ETV Bharat / city

రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలే.. 20న అల్పపీడనం..!

Telangana Weather Report: రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలతో వరుణుడు విరుచుకుపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వైపుకు కిందిస్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Weather report in telangana
Weather report in telangana
author img

By

Published : Oct 17, 2022, 4:47 PM IST

Weather report in telangana: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వైపుకు కిందిస్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొంది. ఈ రోజు దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.