వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులకు స్వస్థి పలికి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామనే నినాదంతో తెనాలి డబుల్‌హార్స్ మినగుళ్ల యాజమాన్యం ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. కేవలం మట్టి, కొబ్బరిపీచుతో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రజాప్రతినిధులకు అందించి, వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ అధినేత ఎం.మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు.
'విత్తన గణేష్' పేరిట వినాయకుడి రూపాలను ఆకర్షణీయంగా తయారు చేయించి, సుమారు మూడు వేలకు పైగా వినాయక విగ్రహాలను రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. పూజ ముగిసిన తర్వాత వినాయక ప్రతిమలపై నీళ్లు పోయడంతో అందులోని విత్తనం మొలకెత్తుతుందని వివరించారు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ తాము ఈ ప్రయత్నాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీచదవండి: RAPE: చిన్నారిని అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక