ETV Bharat / city

మద్యం దుకాణానికి కన్నం వేశాడు.. 18 లక్షలు కొల్లగొట్టారు..

వాచ్​మెన్లుగా పని చేస్తున్న నేపాలీలు నిందితులుగా మారుతున్నారు. తిన్నింటికే కన్నాలు వేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ నెల 11న హిమాయత్​నగర్​లోని ఓ మద్యం దుకాణంలో రూ.18 లక్షలు నగదు దోచుకెళ్లింది ఆ షాపు వాచ్​మెన్​ కుమారుడే.

author img

By

Published : Nov 20, 2019, 5:35 PM IST

మద్యం దుకాణానికి కన్నం వేశాడు.. 18 లక్షలు కొల్లగొట్టారు..

ఈ నెల 11న హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని కుల్​దీప్ వైన్​షాప్​లో చోరీకి పాల్పడ్డ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుకవైపు గోడకు కన్నంవేసి చోరీకి పాల్పడ్డ దొంగలు కౌంటర్ లాకర్​లో ఉన్న రూ.18లక్షల నగదును ఎత్తుకెళ్లారు. షాపు యజమాని మన్మీత్ సింగ్ బగ్గా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. మద్యం దుకాణం​ భవనం వాచ్​మెన్ పరమ్ దమాయి కుమారుడు మన్​రాజ్ దమాయిని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు.

సీసీటీవీలో రికార్డ్ ...

చోరీ జరిగిన తర్వాత దుకాణం వెనుక ఉన్న వాచ్​మెన్ గది ఖాళీగా కనిపించగా.. పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. వీరు నేపాలీకి చెందిన వారు కావడం వల్ల స్థానికంగా నివసించే ఇతర నేపాలీల ద్వారా బేగంబజార్ గుజరాత్ గల్లీలో నివాసముంటున్న వాచ్​మెన్ ఆచూకీ కనుగొన్నారు . పరమ్ దమాయితో పాటు అతని కుమారుడు మన్​రాజ్​ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీలో మన్​రాజ్​తో పాటు మరో ఆరుగురికి హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

చోరీకి ముందు మూడురోజుల బ్యాంకుల సెలవు....

వైన్​షాప్ పక్కనే వాచ్​మెన్ గది ఉండటం మన్​రాజ్​కి చోరీ ప్రణాళిక వేసేందుకు మంచి స్థలం దొరికింది. మద్యం దుకాణం వ్యాపారంపై తన తండ్రికి ఉన్న అవగాహనతో వివరాలన్ని సేకరించాడు. దుకాణంలో పనిచేసే వారి దగ్గరి బంధువు ద్వారా లాకర్ ఎక్కడ ఉంటుంది.. కౌంటర్​లో వచ్చే సొమ్ము ఎక్కడ భద్రపరుస్తారు.. లాంటి వివరాలు సేకరించాడు. చోరీకి ముందు మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉండటం వల్ల డబ్బు పెద్దమొత్తంలో ఉంటుందని నిర్దారించుకున్నాడు మన్​రాజ్. స్నేహితులు రామ్ ప్రసాద్ అలియాస్ రోషన్ బండారీ, లోకేష్ గోపీ శర్మలతో కలిసి చోరీ పథకం రూపొందించాడు. పథకం ప్రకారం తెచ్చుకున్న డ్రిల్లింగ్ మిషన్​తో షాపు వెనుక భాగం నుండి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. లాకర్​ను వాచ్​మెన్ గదిలోకి తీసుకువచ్చి.. బద్దలు కొట్టి అందులో ఉన్న రూ.18లక్షల 30వేల నగదును తీసుకుని అందరూ పంచుకుని అక్కడి నుండి పరారయ్యారు.

తండ్రిని ఇంటికి పంపించాడు...

చోరీకి రెండు రోజుల ముందే మాన్​రాజ్​ తన తండ్రి వాచ్​మెన్​ పరమే దమాయిని అక్కడి నుండి ఖాళీ చేయించి బేగంబజార్‌లోని ఇంటికి పంపించాడు. ప్రధాన సూత్రదారి మాన్​రాజ్ దమాయితో పాటు అతని తండ్రి పరమే దమాయి, లోకేష్ గోపీశర్మ , కృష్ణ పరియార్, గౌరీ ఆజయ్ అహూజాలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7,96,200 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ భిక్షంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు రామ్ ప్రసాద్ భండారీ, దీపక్ ఖత్రీలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదివరకు ఇలాగే...

ఎంతో నమ్మకంగా వాచ్​మెన్​లుగా పని చేస్తుండే నేపాలీలు ఈ మధ్యకాలంలో తిన్నింటికే కన్నాలు వేస్తున్నారు. గత ఏడాది ఇదే డివిజన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో వాచ్​మెన్​గా పనిచేస్తుండే ఓ నేపాలీ కుటుంబం కోటికి పైగా డబ్బులు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఏడాది గడిచిన ఇప్పటికి ఆ కేసులో పురోగతి చోటు చేసుకోలేదు. దేశం సరిహద్దులు దాటితే వారిని పట్టుకోలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు.

మద్యం దుకాణానికి కన్నం వేశాడు.. 18 లక్షలు కొల్లగొట్టారు..

ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

TG_Hyd_06_20_Wine Shop's Chori_Pkg_TS10005 TG_Hyd_44_19లో కూడా వాడుకోగలరు Note: Feed Ftp Contributor: Bhushanam ( ) వైన్ షాప్ లో చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్ చేసి... వారి వద్ద నుండి 7,96,200 నగదు స్వాధీనం చేసుకొని... ఐదుగురిని హైదరాబాద్ నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. Look.... V.O 1: ఈ నెల 11న హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న కుల్ దీప్ వైన్ షాప్ లో వెనుకవైపు గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడిన దొంగలు... కౌంటర్ లాకర్ లో ఉన్న రూ . 18లక్షల నగదును ఎత్తుకెళ్లారు . షాపు యజమాని మన్మీత్ సింగ్ బగ్గా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... షాప్ లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా దర్యాప్తు చేపట్టారు . ఆ దృశ్యలలో వైన్ షాప్ ఉన్న భవనం వాచ్ మెన్ పరమే దమాయి కుమారుడు మన్ రాజ్ దమాయి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించడంతో పోలీసులు అతనిపై దృష్టి పెట్టారు. చోరీ జరిగిన తర్వాత వైన్ షాప్ వెనుక ఉన్న వాచ్ మెన్ రూమ్ ఖాళీగా కనిపించడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. వీరు నేపాలీకి చెందిన వారు కావడంతో స్థానికంగా నివసించే ఇతర నేపాలీల ద్వారా బేగంబజార్ గుజరాత్ గల్లీలో నివాసముంటున్న వాచ్ మెన్ ఆచూకీ కనుగొన్నారు . వాచ్ మెన్ తో పాటు అతని కుమారుడు మన్ రాజ్ దమాయిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీకి సూత్రదారి మన్ రాజ్ ఏమని పోలీసులు కనుగొన్నారు. అతనిచ్చిన వివరాల ద్వారా మరో ముగ్గురిని అరెస్టు చేసారు . మొత్తం చోరీలో పాల్గొన్న ఏడుగురిలో ఐదుగురిని అరెస్టు చేసామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని , వీరంతా నేపాలీలేనని పోలీసులు తెలిపారు . Spot.... V.O 2: వైన్ షాప్ పక్కనే వాచ్ మెన్ గది ఉండటం వల్ల చోరీకి ప్రణాలికను అక్కడే రచించారు. దుండగులు ఇక్కడ జరిగే వ్యాపారంపై పూర్తిగా అవగాహన ఉన్న తండ్రి వద్ద మాన్ రాజ్ వివరాలు సేకరించాడు . నిత్యం రద్దీగా ఉండే వైన్ షాప్ లో రోజువారిగా లక్షల్లో విక్రయాలు ఉంటాయని నిర్దారించుకున్నాడు . దానికి తోడు వైన్ షాప్ లో పనిచేసే వారి దగ్గరి బందువు కృష్ణపారియార్‌ ద్వారా నగదు బద్రపరిచే లాకర్ ఎక్కడ ఉంటుంది , కౌంటర్ లో వచ్చే నగదును ఎలా బద్రపరుస్తారు తదితర వివరాలు సేకరించాడు . చోరీకి చేసే ముందు మూడు రోజులు బ్యాంక్ లకు సెలవు ఉండటం వల్ల డబ్బు పెద్దమొత్తంలో ఉంటుందని నిర్దారణ చేసుకున్నారు. తర్వాత మాన్ రాజ్ తన స్నేహితులు రామ్ ప్రసాద్ అలియాస్ రోషన్ బండారీ , లోకేష్ గోపీ శర్మలతో కలిసి చోరీ పథకం రూపొందించాడు . అనుకున్నట్లుగానే వారితో తెచ్చుకున్న డ్రిల్లింగ్ మిషన్ తో షాప్ వెనుక భాగం నుండి రాంధ్ర చేసి లోపలికి ప్రవేశించారు . నగదు బద్రపరిచిన లాకర్ ను అక్కడి నుండి వాచ్ మెన్ గదిలోకి తీసుకువచ్చి , లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న రూ . 18లక్షల 30వేల నగదును తీసుకుని అందరూ పంచుకుని అక్కడి నుండి పరారయ్యారు . చోరీకి రెండు రోజుల ముందే వాచ్ మెన్ పరమే దమాయిని ను అట్ని కొడుకు మాన్ రాజ్ అక్కడి నుండి ఖాళీ చేయించి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బేగంబజార్‌లోని ఇంటికి పంపించాడు . ప్రధాన సూత్రదారి మాన్ రాజ్ దమాయితో పాటు అతని తండ్రి ( వాచ్ మెన్ ) పరమే దమాయి , లోకేష్ గోపీశర్మ , కృష్ణ పరియార్ , చోరీలో పాల్గొన్న తన భర్త రామ్ ప్రసాద్ భండారీని కాపాడేందుకు ప్రయత్నించిన గౌరీ ఆజయ్ అహూజాలను అరెస్టు చేసామని , వారి వద్ద నుండి రూ . 7 , 96 , 200 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు . ప్రస్తుతం ఇద్దరు నిందితులు రామ్ ప్రసాద్ భండారీ , దీపక్ ఖత్రీలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బైట్: భిక్షం రెడ్డి, అబిడ్స్ఏసీపీ E.V.O: ఎంతో నమ్మకంగా వాచ్ మెన్ లుగా పని చేస్తుండే నేపాళీలు ఈ మధ్య కాలంలో తిన్నింటికె కన్నలు వేస్తున్నారు. గత ఏడాది ఇదే డివిజన్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో వాచ్ మెన్ గా పని చేస్తుండే నేపాలీ కుటుంబం కోటికి పైగా డబ్బులు , బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఏడాది గడిచిన ఇప్పటికి ఆ కేసులో పురోగతి చోటు చేసుకోలేదు. దేశం బార్డర్ దాటి నేపాల్ కు వెళ్ళిపోతే వారిని పట్టుకోలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. కొంత మంది చేస్తున్న ఈ తరహా నేరాల వల్ల ఏళ్లకు తరబడి పని చేస్తున్న వారికి ఇక్కట్లు తప్పేలా లేదు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.