ETV Bharat / city

LAND KABZA: 'తెరాస నాయకులు నా భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు' - land kabza in nizamabad district

కొందరు తెరాస నాయకులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్​లో ఫిర్యాదు చేశాడు. ముఠాలుగా వచ్చి తమను బెదిరిస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని కోరాడు.

LAND KABZA: 'తెరాస నాయకులు నా భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు'

author img

By

Published : Aug 18, 2021, 5:17 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని తమ 3 వేల గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారని రమావత్​ పూల్​సింగ్​ అనే గిరిజనుడు ఆరోపించారు. అర్సపల్లిలోని సర్వే నెంబర్​ 202/E లో ఉన్న ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు.. గ్యాంగులుగా వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్​ డిప్యూటీ మేయర్ ఇద్రిస్​ఖాన్​, మహమ్మద్, నయీం సహా మరికొందరు బెదిరింపులకు దిగుతున్నారని పూల్​సింగ్​ ఆరోపించారు. వారి నుంచి రక్షించాలంటూ తన కుటుంబంతో సహా కలెక్టరేట్​కు వచ్చి.. ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

అర్సపల్లిలోని సర్వే నెంబర్​ 202/ఈలో మాకు 3 వేల గజాల స్థలం ఉంది. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా దౌర్జన్యంగా మాపై దాడి చేసి.. మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇద్రిస్​ఖాన్​, మహమ్మద్​ భాయ్​, నయీం మరికొంతమంది వారి గ్యాంగులతో వచ్చి మాపై దాడి చేశారు. దీనిపై మేమే ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డ్యూటీకి వెళ్లాలన్నా భయంభయంగా వెళ్లాల్సి వస్తుంది.

-పూల్​సింగ్​, బాధితుడు​

LAND KABZA: 'తెరాస నాయకులు నా భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు'

ఇదీ చూడండి: తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.