ETV Bharat / city

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు... ఇదే కారణమట..! - అమ్మఒడి డబ్బులు తీసుకున్నారంటూ విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు

మీ అమ్మ, నాన్న ఏం చేస్తారు. అసలు ఈ పథకానికి మీరు అర్హులే కారు. ప్రభుత్వ సొమ్ము కాజేయటానికే పుట్టారా.. అంటూ ఓ ఉపాధ్యాయుడు విచక్షణ మరచి ఓ విద్యార్థిని చితకబాదాడు. పైగా కొడితే కొట్టించుకోవాలని సమాధానం ఇచ్చాాడా టీచర్. ఏపీలోని కృష్ణాజిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

student_ni_kotina_teacher
student_ni_kotina_teacher
author img

By

Published : Jan 23, 2020, 11:49 PM IST

ప్రభుత్వ పథకాలు అప్పనంగా అనుభవించేందుకు పుట్టారా... అంటూ ఓ విద్యార్థిపై విచక్షణ రహితంగా ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని​ కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ బాయ్స్ హై స్కూల్​లో జరిగింది.

లాగు సిద్ధార్థ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అమ్మఒడి పథకం ద్వారా సిద్ధార్థ తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15,000 అందరిలాగానే జమయ్యాయి. పాఠశాలలో ఉపాధ్యాయుడైన శ్రీనివాసరావు సిద్ధార్థను పిలిచి.. మీ అమ్మ, నాన్న ఏమి చేస్తారు. ప్రభుత్వం డబ్బు కాజేసేందుకే పుట్టారా అంటూ విచక్షణ రహితంగా కొట్టి సిద్ధార్థ తలను గోడకేసి గుద్దాడు. ఎందుకు సార్ కొడుతున్నారంటే కొడితే కొట్టించుకోవాలన్న సమాధానం ఇచ్చారని విద్యార్థి వాపోతున్నాడు.

మా అబ్బాయిని మేమే కొట్టం..మీరెలా కొడతారు. ఏమైనా తప్పు చేస్తే మాకు చెప్పాలి.. అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్టు కొడతారా అంటూ సిద్ధార్థ తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. సిద్ధార్థ తండ్రి శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు...

ఇదీ చదవండి :ఈ మండలి మనకు అవసరమా..?: ఏపీ సీఎం జగన్

Intro:ap_vja_36_23_student_ni_kotina_teacher_avb_ap10122
కృష్ణాజిల్లా నూజివీడు
ప్రభుత్వ పథకాలు అప్పనంగా అనుభవించేందుకు పుట్టారా... అంటూ ఓ దళిత విద్యార్థి పై విచక్షణ రహితంగా ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన
కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో ని ఎస్.ఆర్.ఆర్ బాయ్స్ హై స్కూల్ లో లాగు సిద్ధార్థ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు విద్యార్థి తండ్రి స్థానిక అజరయ్య పేటకు చెందిన భవన నిర్మాణ కార్మికుల ఒకడైన పెయింటింగ్ పనిచేస్తున్న శ్రీనివాస రావు కుటుంబం దిగువ మధ్య తరగతికి చెందినది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అమ్మఒడి ద్వారా సిద్ధార్థ తల్లి బ్యాంకు అకౌంట్లో 15000 అందరిలాగానే జమయ్యాయి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస రావు సిద్ధార్థ మీ అమ్మ బాబు ఏమి చేస్తారు ప్రభుత్వం డబ్బు కాజేసిన అందుకే పుట్టారా అంటూ శిక్షణ రహితంగా కొట్టి సిద్ధార్థ తలను గోడ కు కొట్టినట్టుగా బాధితుడు అయినా సిద్ధార్థ అతని తండ్రి పెయింటర్ శ్రీనివాసరావు పోతున్నారు పాఠశాల అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు కుమారుడు అని తెలిసి కూడా ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు
( సర్ కృష్ణాజిల్లా నూజివీడు నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:అమ్మ ఒడి డబ్బులు ఏమి చేశారంటూ విద్యార్థిని కొట్టినా ఉపాధ్యాయుడు

Conclusion:అమ్మ ఒడి డబ్బులు ఏమి చేశారంటూ విద్యార్థులు కొట్టిన ఉపాధ్యాయుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.