ETV Bharat / city

Employment Exercise: పోస్టుల వర్గీకరణ కసరత్తు కొలిక్కి వచ్చాకే ఖాళీల భర్తీపై నిర్ణయం - తెలంగాణ జాబ్య్

ప్రభుత్వ ఉద్యోగాల కసరత్తు కొనసాగుతోంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని శాఖల్లో పోస్టుల వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను జిల్లా, జోనల్ వారీగా కేటాయింపులు చేసి కచ్చితమైన ఖాళీలను నిర్ధారించనున్నారు. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. కసరత్తు ఓ కొలిక్కి వచ్చాక ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది

Employment Exercise
Employment Exercise
author img

By

Published : Sep 11, 2021, 4:19 AM IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 2018కి అనుగుణంగా ఉద్యోగాల కసరత్తు కొనసాగుతోంది. కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఆ జోన్లు, 33 జిల్లాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వర్గీకరించాల్సి ఉంది. అన్ని శాఖల్లోని పోస్టులను రాష్ట్ర, మల్టీజోనల్, జోనల్, జిల్లా కేడర్​లుగా ఇప్పటికే విభజించారు. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ఆయా జిల్లాల్లో ఉన్న ఉద్యోగాల లెక్కను తేల్చే పనిలో అధికారులు పడ్డారు.

భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా..

సంబంధిత శాఖల్లో కేడర్ వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్న ఖాళీలు, తదితర వివరాలను సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కచ్చితమైన వివరాలు ఉండేలా సుధీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖలు గతంలో ఇచ్చిన వివరాలను ఆర్థికశాఖ గత నాలుగు రోజులుగా ఆయా శాఖలతో సమావేశమై ఉద్యోగులు, ఖాళీల వివరాలను సమీక్షించింది. ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చాకే.. ఉద్యోగుల విభజనకు సంబంధించిన తదుపరి కసరత్తు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 2018కి అనుగుణంగా అన్ని నిబంధనలను సవరించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఏ పోస్టులు ఎన్ని ఉండాలన్న విషయమై కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అందుకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉద్యోగుల కేటాయింపులు చేయాలి. 33 జిల్లాలకు ఉద్యోగుల పంపకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్యోగులకు ఐచ్చికాలు ఇవ్వాలని, సీనియార్టీని ప్రాతిపదిక తీసుకోవాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగులను జిల్లాల వారీగా శాశ్వత కేటాయింపులు చేయాలని అంటున్నారు.

65వేలకు పైగా ఖాళీలు..

కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ కింద విధులు కేటాయించారు. వారిని కూడా జిల్లాలకు శాశ్వతంగా కేటాయించాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైతే అన్ని అంశాలు ఓ కొలిక్కి వస్తాయి. అప్పుడు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం వస్తుందని చెప్తున్నారు. ఏ శాఖలో, ఏ జిల్లాలో ఏ పోస్టు ఖాళీగా ఉందన్న విషయమై పూర్తి స్పష్టత వస్తుందని... తద్వారా నియామకాలకు సంబంధించి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అన్ని ప్రభుత్వ శాఖల్లో 65వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి.

ఆ శాఖల్లోనే ఎక్కువ పోస్టులు..

హోం, విద్య, వైద్యశాఖలోనే ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అయితే పాఠశాలల హేతుబద్ధీకరణ నేపథ్యంలో వీటి భర్తీ విషయమై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. ఉద్యోగాల కసరత్తు పూర్తయ్యాక మిగతా ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నియామకాలకు సంబంధించి కూడా నియమనిబంధనలను సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి పారదర్శకంగా ఉండేలా... ఒక కేడర్ పోస్టులన్నింటికీ ఏకరూప భర్తీ విధానం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చూడండి: ఎస్​బీఐ డెబిట్​ కార్డ్ పోయిందా? సులభంగా కొత్తది పొందండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.