ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నరేంద్రపురానికి చెందిన సత్యనారాయణరాజు 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్‌బీ ధర్మారెడ్డికాలనీ ఫేజ్-1లో స్థిరపడ్డారు. తనకు చెందిన రెండు భవనాల్లో రెండు వసతి గృహాలు, సమారు 13 దుకాణాలు నడుస్తున్నాయి. వీటితో నెలకు రూ.20 లక్షలకు పైగా అద్దె వస్తోంది.
లాక్‌డౌన్‌తో వసతి గృహాలు మూతపడ్డాయి. దుకాణాలదీ ఇదే పరిస్థితి. ఫలితంగా మార్చి 22 నుంచి మూడు నెలల పాటు కిరాయిదారులు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆపత్కాలంలో అండగా నిలవడం పట్ల కిరాయిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి: వరంగల్లో ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి