ETV Bharat / city

బీటెక్‌ కనీస ఫీజు రూ.75 వేలుగా నిర్ధరణ.. తెలంగాణలో ఎంతో తెలుసా.? - అఖిల భారత సాంకేతిక విద్యామండలి

BTech Colleges Annual Fee: జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ బీటెక్ కనీస వార్షిక ఫీజును రూ.70వేల నుంచి రూ.75వేలుగా నిర్ధరించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ తాజాగా నివేదికను ఏఐసీటీఈకి అందజేసింది. వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి కనీస ఫీజు అమల్లోకి వస్తుందని ఏఐసీటీఈ వర్గాలు తెలిపాయి.

BTech Colleges
బీటెక్‌
author img

By

Published : Mar 23, 2022, 9:59 AM IST

BTech Colleges Annual Fee: బీటెక్‌ కనీస వార్షిక ఫీజును రూ.70వేల నుంచి రూ.75వేలుగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నిర్ధరించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ తాజాగా నివేదికను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి అందజేసింది. ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఇతర వృత్తివిద్యా కోర్సుల గరిష్ఠ ఫీజు ఆయా నగరాల స్థాయిని బట్టి ఎంత ఉండాలో స్పష్టంచేసిన శ్రీకృష్ణ కమిటీ.. ఏఐసీటీఈ సూచన మేరకు కనీస ఫీజులను సైతం తాజాగా నిర్ధరించింది.

బీటెక్‌కు గరిష్ఠంగా మెట్రో నగరాల్లో రూ.1.58లక్షలు ఉండొచ్చని స్పష్టంచేసిన కమిటీ.. ఇప్పుడు కనీస రుసుము రూ.75వేలుగా పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాల ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)లకు గత అక్టోబరులో లేఖలు రాసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని తుది నివేదికను ఏఐసీటీఈకి అందజేసింది. దాన్ని సమీక్షించాక ఏఐసీటీఈ తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి కనీస ఫీజు అమల్లోకి వస్తుందని ఏఐసీటీఈ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో బీటెక్‌ కనీస రుసుము రూ.35వేలుగా ఉంది.

ఇదీ చదవండి:Notifications: మానేయాలా.. వద్దా.. సందిగ్ధంలో ప్రైవేటు ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.