ETV Bharat / city

Saidabad: రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించిన హైకోర్టు - సైదాబాద్‌ హత్యాచార ఘటన

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది.

High Court on raju death
High Court on raju death
author img

By

Published : Sep 17, 2021, 7:07 PM IST

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లైంగికదాడి, హత్యకేసు నిందితుడు రాజు మృతిపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దాఖలు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, మృతదేహం పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని అడ్వొకేట్‌ జనరల్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ చిత్రీకరణ జరిగిందని వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది. వీడియోలు రేపు రాత్రి 8గంటలకల్లా అందజేయాలని సూచించింది.

ఇదీ చూడండి: Saidabad Rape case : సైదాబాద్​ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.