ETV Bharat / city

Ap High court: ఏకపక్షంగా ఫీజుల ఖరారు.. ఏపీ హైకోర్టులో విచారణ - ఫీజులపై ఏపీ హైకోర్టు తీర్పు

క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం రుసుములను ఖరారు చేస్తూ జీవోలు జారీచేసిందని ప్రైవేటు పాఠశాలలు , కళాశాలల యాజమాన్యాలు ఆ రాష్ట్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ సర్కార్ ఆగస్టు 24న జారీచేసిన 53, 54 జీవోలను సవాలు చేస్తూ ' తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ' అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థలు ఆ రాష్ట్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి.

ap High court
ap High court
author img

By

Published : Sep 7, 2021, 10:39 AM IST

క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆ రాష్ట్ర హైకోర్టుకు విన్నవించాయి. రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తుచేశాయి.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ¨, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలుగా విద్యా సంస్థలను విభజించి రుసుములను నిర్ణయించడానికి చట్ట నిబంధనలు అంగీకరించవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. వీటిని సవాలు చేస్తూ ‘తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌’ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున వ్యాజ్యాలు వేశారు. సోమవారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు సోమవారం ఈ ఆదేశాలిచ్చారు.

రుసుముల నిర్ణయం మా హక్కు

'లాభసాటి వ్యాపార ధోరణి అవలంభించనంత వరకు సముచితమైన రుసుములను వసూలు చేసుకునే హక్కు ప్రైవేటు విద్యా సంస్థలకు ఉంది. సొంత రుసుములను నిర్ణయించుకునే హక్కు విద్యా సంస్థలకు ఉంటుందని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. విద్యా సంస్థల నిర్వహణ ఖర్చుల వివరాల్ని, రికార్డులను పరిశీలించాకే ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కమిషన్‌ అవేమీ చేయకుండానే రుసుములను సిఫారసు చేసింది. జీవోల జారీకి ముందు ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం చేయలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోల అమలును నిలుపుదల చేయండి".

- విద్యాసంస్థల తరఫు న్యాయవాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.