రేషన్ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం వల్ల విచారణకు అర్హత లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది.
గతంలో రేషన్ వాహనాల రంగులు మార్చాలని ఎస్‌ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషన్ని డిస్పోజ్ చేసింది.
ఇదీ చదవండి: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్