నాగుల చవితిని పురస్కరించుకొని నాగమ్మ ఆలయాల్లో వేడుకలు వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, పాతబోయిన్పల్లి తదితర ప్రాంతాలలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
కంటోన్మెంట్లోని తిరుమలగిరి పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన నాగదేవత ఆలయంలో భక్తులు పోటెత్తారు. జంటనగరాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి కలశ పూజ, వినాయకుని పూజలతో పాటు కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఇదీ చూడండి: లైవ్: సైన్యం, వాయుసేన, బలగాలు.. హైఅలర్ట్