కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. మోదీ విధానాల ఫలితంగా అంబానీ, అదానీ ఆస్తులు ఆరు నెలల కాలంలో అమాంతంగా పెరగాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంకేతిక విద్యను అంబానికి ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాలుగో మహాసభలు కోవిడ్ నియమాలకు అనుగుణంగా హైదరాబాద్లోని సుందరయ్య కళా నిలయంలో నిర్వహించారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ విద్యా రంగంలో ఉన్న సమస్యల గురించి, ఉపాధ్యాయుల డిమాండ్ల గురించి పట్టించుకోవడం లేదంటూ... రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు కే.జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత