ETV Bharat / city

మనసున్న మారాజులు.. మా మంచి డాక్టర్లు.. - doctors help in corona time

కరోనా వంటి విపత్కర సమయంలోనూ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు మనసున్న మారాజులు. ఉచిత వైద్యంతో పాటు మందులను అందజేస్తూ... నిరుపేదల పాలిట దేవుళ్లుగా మారారు. అందులో కొంతమంది వైద్యులు కూడా ఉండటం సంతోషకరమైన విషయం.

ఉచితంగా వైద్యం, మనసున్న వైద్యులు, కరోనా రోగులకు ఉచిత వైద్యం

author img

By

Published : Jun 27, 2021, 12:19 PM IST

కొవిడ్‌ ఉద్ధృతి సమయంలో దాదాపు ప్రతి కుటుంబంలోనూ బాధితుల్ని చూశాం. ఆ విపత్కర పరిస్థితుల్లోనూ ముందుకు వచ్చి బాధితులకు ఉచితంగా వైద్యం, మందులూ అందిస్తూ అండగా నిలిచిన యోధులు కొందరు ఉన్నారు. ఆ కోవకే చెందుతారు వీరు!

10 రూపాయలకే వైద్యం...

రేషన్ కార్డు చూపిస్తే.. 10 రూపాయలకే వైద్యం

హైదరాబాద్‌లోని మేడ్చల్‌ ప్రాంతంలో డాక్టర్‌ విక్టర్‌ ఇమాన్యుయేల్‌ నడుపుతున్న ప్రజ్వల క్లినిక్‌కు రోజూ 100 మంది వివిధ రకాల సమస్యలతో చికిత్స కోసం వస్తారు. తెల్ల రేషన్‌ కార్డు చూపిస్తే వారి నుంచి రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటారీ డాక్టర్‌. తెల్ల కార్డు లేకపోయినా రైతులూ, సైనికులూ, అనాథలూ, దివ్యాంగులూ వారి కుటుంబ సభ్యులకు కూడా అంతే మొత్తం తీసుకుంటారు. మధుమేహం, గుండె జబ్బులూ, నరాల సమస్యలు ఉన్నవాళ్లు ఈయన దగ్గరకు ఎక్కువగా వస్తారు. ‘నాలుగేళ్ల కిందట ఓ మహిళ ఒక హాస్పిటల్‌ బయట డబ్బులు అడుగుతూ కనిపించింది. ఐసీయూలో ఉన్న భర్త చికిత్స కోసం ఆమె ఆ పనిచేసింది. ఆ సంఘటన నన్ను కలచివేసింది. అప్పట్నుంచీ పేదలకు రూ.10కే వైద్యం చేస్తున్నాను. నా భార్య కూడా వైద్యురాలు. ఆమెతోపాటు స్నేహితులూ, కుటుంబ సభ్యుల మద్దతూ ఉంటోంది’ అని చెప్పే ఈ డాక్టర్‌... కొవిడ్‌ తీవ్రంగా ఉన్నపుడు రోజూ దాదాపు 150 మందిని పరీక్షించినట్లు చెబుతారు. ఇప్పటివరకూ సుమారు 20వేల మంది కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయించి తమ వైద్య సిబ్బందిని అక్కడ ఉంచారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని గాంధీ ఆసుపత్రికి పంపించేవారు. ‘రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేయొచ్చు. కానీ వారి ఆత్మగౌరవం దెబ్బ తినకూడదని ఫీజు తీసుకుంటా’నని చెబుతారీ డాక్టర్‌.

తండాలకూ ఆక్సిజన్‌...

ట్వీట్ చేస్తే చాలు... తండాలకూ ఆక్సిజన్ సిలిండర్లు

కొవిడ్‌ రెండో దశలో పల్లెల్లోనూ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో వైద్యం సకాలంలో అందక గ్రామీణులు ఇబ్బంది పడ్డారు. రవాణా సదుపాయాలు అస్సలే ఉండని తండాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఈ విషయాన్ని గ్రహించిన హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ డేటా ఇనీషియేటివ్స్‌ ఫోరమ్‌(ఎస్‌డీఐఎఫ్‌) సుదూరాల్లోని తండాలకూ, గ్రామాలకూ ఆక్సిజన్‌ సిలిండర్లూ, మందులూ, ఇతర వైద్య పరికరాల్ని అందించింది. ఎవరైనా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలని ట్విటర్‌లో కోరితే అది తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేశారు. తమకు దగ్గర్లోని ప్రదేశాలనుంచి ఆ పిలుపు వస్తే వెంటనే వారిని ఫోన్లో సంప్రదించి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించేవారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్‌, నారాయణ్‌పేట్‌, గుంటూరు, కడప ప్రాంతాల్లో వీరి ఆక్సిజన్‌ బ్యాంకులు ఉన్నాయి. తెల్లకార్డు ఉన్నవారికి ఉచితంగా, మిగిలిన వారినుంచి రవాణా ఛార్జీలు తీసుకుంటూ అందిస్తున్నారు. వీరి ఉనికిలేని ప్రాంతాల్లో బాధితుల బంధువులకు స్థానిక స్వచ్ఛంద సంస్థల వివరాలు అందిస్తారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో రోజూ 100 వరకూ సిలిండర్లు అందించేవాళ్లమని చెబుతారు సంస్థ వ్యవస్థాపకులు మొహమ్మద్‌ అజాంఖాన్‌. నగరంలో పేదలకు నిత్యావసరాలు అందించారు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌లో వర్షాలు వచ్చినపుడూ బాధితులకు సాయపడ్డారు. విద్యారంగంలో ఉపకారవేతనాలనూ అందిస్తున్నారు.

ఫోన్‌లోనే కొవిడ్‌ చికిత్స...

ఫోన్‌కాల్‌ ద్వారా, వీడియో కాల్‌ ద్వారా సలహాలు

కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో చాలామంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వారికి ఎందరో మనసున్న వైద్యులు ఫోన్‌కాల్‌ ద్వారా, వీడియో కాల్‌ ద్వారా సలహాలు ఇచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన వైద్యులు బి.సుజీత్‌ కూడా ఉన్నారు. ఈయన ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌ సర్జన్‌. 2020లో కొవిడ్‌ ప్రారంభం నుంచి నేటివరకూ ఆయన ఫోన్‌ మోగుతూనే ఉంది. హాస్పిటల్‌లో బెడ్‌ కోసం ఇబ్బందులు పడతున్నవారిని చూసి ఫోన్‌ద్వారా ఉచితంగా సేవలు అందించాలనుకున్నారు సుజీత్‌. మొదట ఒక పరిచయస్థుడికి తీసుకోవాల్సిన మందులూ, జాగ్రత్తలు చెప్పడంతో అతడికి నయమైంది.

ఉచితంగా, అదికూడా అత్యుత్తమ చికిత్స అందడంతో ఆయన తనకు తెలిసినవాళ్లకి చెప్పాడు. అలా డాక్టర్‌ సుజీత్‌ గురించి నోటిమాటద్వారా వేల మందికి తెలిసింది. ‘లక్షణాలు తీవ్రంగా లేనివారిని హాస్పిటల్స్‌ చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండమని ఫోన్‌లో చికిత్స చేసేవాణ్ని’ అని చెబుతారు సుజీత్‌. పేషెంట్లను రోజుకు మూడుసార్లు ఫోన్లోనే పరామర్శిస్తూ... ఆక్సిజన్‌ స్థాయులు, టెంపరేచర్‌ లాంటి వివరాల్ని తెలుసుకునేవారు. వాటికి తగ్గట్టు మందులు రాసేవారు. కొన్నాళ్లుగా నగరంలోని మణికొండలో ‘సుజీత్‌ ఫౌండేషన్‌’ ద్వారా పేదలకు తక్కువ ధరల్లో వైద్య సేవలు అందిస్తున్నారీయన. వారంలో అయిదురోజులు ఫౌండేషన్‌ క్లినిక్‌లో ఉచితంగా రోగుల్ని పరీక్షిస్తారు. ఆరోగ్య శిబిరాలూ నిర్వహిస్తారు. అయిదువేల రూపాయలకే వైద్య పరీక్షలూ, శస్త్రచికిత్సా పూర్తయ్యేలా ఓ హాస్పిటల్‌ నిర్మించాలనేది ఈ డాక్టర్‌ లక్ష్యం.

ఇదీ చూడండి: 'కొవిడ్‌ క్లెయింలను వేగంగా పరిష్కరిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.