ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మెడికో వంశీ మృతదేహం ఇంటికి చేరింది. ఫిలిప్పీన్స్లో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారి చివర చూపైనా దక్కేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలానికి రప్పించాలని వారి కన్నవారు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. అధికారులు స్పందించి విదేశాంగ శాఖతో మాట్లాడి మెడికో మృతదేహాలు సొంతూళ్లకు రప్పించారు. అనంతపురం చేరుకున్న వంశీ మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇవాళ అంతక్రియలు జరపనున్నారు.
ఇవీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్ఎంసీలోనే