ETV Bharat / city

మిల్లర్ల మాయాజాలం... చోద్యం చూస్తున్న అధికారులు...

రాష్ట్రంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ ఇస్తోంది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో బియ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నారో అధికారులకే తెలియాలి. ప్రతి సీజనులో ధాన్యమో... బియ్యమో గోల్‌మాల్‌ అవుతూనే ఉన్నాయి.

rice millers
rice millers
author img

By

Published : Apr 22, 2022, 3:18 AM IST

తెలంగాణలో ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ ఇస్తోంది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో బియ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నారో అధికారులకే తెలియాలి. ఒకపక్క చేతి వాటం... మరోపక్క తాత్సారం వెరసి పౌరసరఫరాల శాఖ విమర్శలకు గురవుతోంది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండటంతోనూ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు మాయం చేసిన బియ్యాన్ని తిరిగి వసూలు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన సొమ్మును కూడా తీసుకోలేని పరిస్థితి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆడిట్‌ వ్యవహారాలు పూర్తి చేయకపోవటమూ ఇందుకు ఓ కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పలు రాష్ట్రాల్లో పూచీకత్తుతోనే మిల్లులకు.. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ముందు బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటారు. మిల్లర్లు బియ్యం ఇచ్చిన తర్వాతే పంజాబ్‌ ప్రభుత్వం ఆ మేరకు ధాన్యం ఇస్తుంది. తెలంగాణలో మాత్రం బ్యాంకు గ్యారెంటీ, ఎలాంటి పూచీకత్తులు లేకుండా మిల్లర్లకు ధాన్యం ఇస్తారు. కొందరు ఇదే అదనుగా పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచినా మాయం చేసిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి సర్కారు వసూలు చేయలేకపోతుంది. 2019-20 యాసంగికి సంబంధించి సుమారు రూ.400 కోట్ల విలువ చేసే 1.01 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి తెలియకుండా విక్రయించుకున్నారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో పలు కథనాలు రావటంతో ప్రభుత్వం విచారణ చేపట్టి ఆయా మిల్లులను గుర్తించింది. ఎలా వసూలు చేయాలన్న అంశంపై కమిటీ వేసింది. 25 శాతం అపరాధ రుసుంతో ఆ బియ్యాన్ని ఇవ్వాలంటూ పౌరసరఫరాల శాఖ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వసూలు చేసింది. మిగిలిన బియ్యం ఎప్పటికి అందుతుందో.. అపరాధ రుసుం ఎన్నటికి వసూలవుతుందో మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఇలా అయితే డొల్లే... మిల్లర్ల చేతివాటానికి అడ్డుకట్ట వేయకపోతే పౌరసరఫరాల సంస్థ ఆర్థిక పరిస్థితి డొల్లగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పూచీకత్తుతో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేస్తుంది. మిల్లింగ్‌ చేసి బియ్యం ఇచ్చిన తరవాత సుమారు 90 శాతం మొత్తాన్ని పౌరసరఫరాల సంస్థకు ఎఫ్‌సీఐ చెల్లిస్తుంది. ఆడిట్‌ వ్యవహారాలు పూర్తయ్యాక మిగిలిన మొత్తాన్ని ఇస్తుంది. 2014-15 సంవత్సరానికి సంబంధించి మాత్రమే పూర్తిస్థాయి ఆడిట్‌ అయినట్లు సమాచారం. మరో రెండేళ్లకు సంబంధించిన ఆడిట్‌ వ్యవహారాలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో ఆడిట్‌ నివేదికలు అందజేయకపోవటంతో కేంద్రం నుంచి సుమారు రూ. 600-700 కోట్ల వరకు నిధులు నిలిచిపోయాయి. నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఆడిట్‌ లెక్కలు ఇవ్వండి అంటూ పౌరసరఫరాల శాఖకు ఎఫ్‌సీఐ లేఖ రాసింది. మరోపక్క వడ్డీల రూపంలో పౌరసరఫరాల సంస్థ రూ.పదుల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతుంది.

* 2019-20 యాసంగిలో 1.01 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. అపరాధ రుసుం సంగతి అటుంచి ఇప్పటి వరకు ఆ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోయింది. మరోపక్క ధాన్యం కొనుగోలుకు బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు వడ్డీలు చెల్లిస్తోంది.

* గడిచిన యాసంగి సీజన్‌ నిల్వలకు సంబంధించి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తే 40 మిల్లుల్లో 18,155 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయమైందని తేలింది. మిగిలిన 2,320 మిల్లుల్లో పరిశీలిస్తే ఇంకెంత మొత్తంలో గోల్‌మాల్‌ వ్యవహారం నడిచిందో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన గవర్నర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.