దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రోజులు గడుస్తుండటంతో దుర్వాసన వస్తున్నాయి. నిజానికి ఈనెల 13 వరకే వాటిని భద్రపరచాలని చెప్పిన గడువు ముగిసినా వాటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఎంబాంబింగ్ చేస్తే...
ఎంబాంబింగ్ చేస్తే రెండు వారాలపాటు భద్రపరచవచ్చు. కానీ రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచినా వారం వరకే ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించి ఆసుపత్రి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో తీర్పు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మృతదేహాలను దిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలని ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.