ETV Bharat / city

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే.. అమరావతిపై సుప్రీంలో పిటిషన్ - రాజధాని రైతులు

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలని, 6 నెలల్లో దీన్ని అభివృద్ధి చేయాలంటూ..హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు చెల్లదని పిటిషన్‌ వేసింది. పాలన ఎక్కడి నుంచి నిర్వహించాలని నిర్ణయించుకునే హక్కు, సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని ఈ అధికారం రాష్ట్రానికి లేదనడం రాజ్యాంగ విరుద్ధని పిటిషన్‌లో వెల్లడించింది. హైకోర్టు తీర్పును నిలువరించాలని కోరింది.

Supreme court on 3 capitals
Supreme court on 3 capitals
author img

By

Published : Sep 18, 2022, 9:49 AM IST

అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ, మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని.. అయితే ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసినందున ఆ తీర్పు నిరర్థకమని దాన్ని కొట్టేయాలని విన్నవించింది. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని ప్రస్తావించింది.

శనివారం ఉదయం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టు వెబ్‌నైట్ ద్వారా తెలిసింది. వాస్తవానికి హైకోర్టు తీర్పువచ్చిన 90 రోజుల్లోగా అప్పీల్ వేయాలి. ప్రస్తుతం 6 నెలల వరకు జాప్యమైంది. అందువల్ల ఈ పిటిషన్‌కు ఎస్​ఎల్​పీ నంబరు కేటాయించకుండానే డైరీ నంబరు ఆధారంగా లిస్టు చేసే అవకాశముందని న్యాయవాదులు తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేసిన కొందరు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ వేసినందున వారికి పిటిషన్ కాపీ పంపాకే కోర్టు దీనిని విచారణకు స్వీకరిస్తుందని చెప్పారు.

ఆర్టికల్‌ 226 కిందనున్న అసాధారణ అధికారాలను ఉపయోగించి రాజధాని ప్రాంతంలో ప్రగతి పనులను యథాతథంగా కొనసాగించాలని గత మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. మాస్టర్‌ప్లాన్‌ మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమీకరించిన భూమిలో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రభుత్వం, సీఆర్​డీఏ చెప్పడంవల్లే రైతులు భూములను అప్పగించారని తెలిపింది. విధానాల మార్పునకు ప్రభుత్వాలు మారడం ప్రాతిపదిక కాదని తేల్చిచెప్పింది. పాత ప్రభుత్వం 15వేల కోట్ల రూపాయల పనులు చేపట్టడంతో పాటు, మరో 32వేల కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టింది. పాత ప్రభుత్వాలు చేపట్టిన అన్ని పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికీ ఉంటుందని, ఆర్థిక సంక్షోభమనో.. ఇంకో పేరుతోనో ప్రగతి పనులను అకస్మాత్తుగా ఆపేయడం ఆమోదయోగ్యం కాదని తీర్పులో వెల్లడించింది. బృహత్‌ ప్రణాళికలో సొంతంగా ఎలాంటి మార్పులు చేయకూడదని ఆదేశించింది. రాజధాని మార్చడం, రాజధాని నగరాన్ని విభజించే శాసనాధికార సామర్థ్యం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం, రాజధాని కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహించాలని నిర్ణయించుకునే హక్కు.. సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పిటిషన్‌లో తెలిపింది. ఈ అధికారం రాష్ట్రానికి లేదనడం రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధని వివరించింది. శాసనవ్యవస్థను నిలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాజ్యాంగం చెప్పిన అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని.. అందువల్ల ఈ తీర్పును నిలువరించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో అభ్యర్థించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.