ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పేపర్-1కు.. 3 లక్షల 18 వేల 444 మంది హాజరు కాగా.. 32 పాయింట్ 68 శాతంతో లక్ష 4 వేల 78 మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ పేపర్-2కు.. 2 లక్షల 50వేల 897 మంది హాజరు కాగా.. 49 పాయింట్ 64 శాతంతో లక్ష 24 వేల 535 అభ్యర్థులు అర్హత సాధించారు.
ఉత్తీర్ణతకు 150 మార్కుల్లో జనరల్ అభ్యర్థులకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 60 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. ఫలితాలు www.tstet.cgg.inలో అందుబాటులో ఉన్నాయి. పేపర్ వన్ లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు... పేపర్ టూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా చేసేందుకు అర్హులు. ఫలితాలు వెల్లడించగానే వెబ్ సైట్ మొరాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అభ్యర్థులు టెట్ ఫలితాలు చూసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.. www.tstet.cgg.gov.in