ETV Bharat / city

SSC Paper Leak: నంద్యాల జిల్లాలో పది ప్రశ్నాపత్రం లీక్‌.. చిత్తూరు జిల్లాలో వదంతులు

SSC Paper Leak: ఏపీలోని నంద్యాల జిల్లాలో టెన్త్​ ప్రశ్నాపత్రం వాట్సాప్​లో దర్శనమిచ్చింది. సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్​లు పేపర్‌ను లీక్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

SSC Paper Leak: నంద్యాల జిల్లాలో పది ప్రశ్నపత్రం లీక్‌.. చిత్తూరు జిల్లాలో వదంతులు

author img

By

Published : Apr 27, 2022, 1:19 PM IST

SSC Paper Leak: ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యింది. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం వెలుగుచూసింది. సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్​లు పేపర్‌ను లీక్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ లీకైందో తమకు తెలియదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి పేపర్‌ లీక్‌ విషయాన్ని తీసుకెళ్లారు.

ఈ విషయంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డీఈవో పురుషోత్తం తెలిపారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ వార్తలు నమ్మొద్దని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని.. చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతి..

ఆర్టీసీ శుభవార్త.. పరీక్షలు రాసే విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.