విదేశాల నుంచి కొవిడ్ చికిత్స నిమిత్తం ఉపయోగించేందుకు దిగుమతి చేసుకునే ఔషధాలు, పరికరాలు, యంత్ర సామాగ్రి తదితర వాటిపై ఐజీఎస్టీ మినహాయింపు పత్రాలు జారీ చేసేందుకు వీలుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్‌ను తాత్కాలిక నోడల్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే కొవిడ్ ఉపశమన సామాగ్రి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
దిగుమతులపై ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఐజీఎస్టీ కూడా విధించాల్సి వస్తుండటం వల్ల... రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. మినహాయింపు ధ్రువీకరణ పత్రాల కోసం cst@tgct.govt.in, neetuprasad@gmail.com లను మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది.